
షిల్లాంగ్: మందు తాగడం రాష్ట్ర జీవన విధానంలో భాగమని, అందుకు వైన్ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మారీ రాష్ట్ర సీఎం కొన్రాడ్ కె. సంగ్మాకు శుక్రవారం లేఖ రాశారు. ఎర్నెస్ట్ ప్రస్తుతం ఖాసీ హిల్స్ వైన్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శుక్రవారానికి 3041కి, మరణాల సంఖ్య 90కి చేరింది. (9 గంటలకు.. 9 నిమిషాల పాటు)
రాష్ట్రాలవారీగా ప్రకటించిన గణాంకాల మేరకు శుక్రవారం ఒక్కరోజే 534 కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 647 కేసులు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ మత కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించినవి తెలుస్తోంది. (విదేశీ ‘తబ్లిగీ’లపై చర్యలు)
Comments
Please login to add a commentAdd a comment