wines shops
-
ఆదాయం కోసం ప్రభుత్వం అడ్డదారులు: అన్నా హజారే
సాక్షి, ముంబై: సూపర్ మార్కెట్లలో, కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పోరాటాలకు సిద్ధమవుతుండగా, ప్రముఖ సమాజ సేవకుడు అన్నా హజారే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో స్పష్టం చేయాలని సోమవారం అన్నాహజారే బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ నిర్ణయం రైతుల హితవు కోసం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క వైన్ అంటే మద్యం కాదని కూడా అంటోంది. కానీ ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ విక్రయం ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి కీడు చేస్తుందో త్వరలో బయటపడు తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మన రాజ్యాం గం ప్రకారం ప్రజలను వ్యసనాల నుంచి, మాదక ద్రవ్యాలనుంచి విముక్తి చేయడం, మద్యపానానికి దూరంగా ఉంచడం ప్రభుత్వాల విధి. మద్యానికి వ్యతిరేకంగా ప్రచారాల ద్వారా, జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వమే అదనపు ఆదాయం కోసం వ్యసనాలకు బాట వేసే నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల హితవు కోసమైతే పేదలు, సాధారణ రైతులు పండించిన పంటలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. కానీ రైతులకు మేలు చేసే అలాంటి చర్యలను విస్మరిస్తూ, యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల లీటర్ల వైన్‌ను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. మంత్రులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు 2021 నవంబర్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న స్కాచ్ విస్కీపై విక్రయ పన్ను 300 శాతం నుంచి 150 శాతానికి కుదించింది. మద్యం ధరలు తగ్గడంతో విక్రయాలు జోరందుకున్నాయి. ఫలితంగా 2.5 లక్షల బాటిళ్ల విక్రయం పెరిగిపోయింది. ప్రభుత్వానికి లభించే రూ.100 కోట్ల ఆదాయం ఏకంగా రూ.250 కోట్లకు చేరుకుంది. ప్రజలు మద్యానికి బానిసలై సర్వం కోల్పోయినా పర్వాలేదు, ఆదాయం పెరిగితే చాలని ప్రభుత్వం అనుకుంటోందా అని హజారే ప్రశ్నించారు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, కొందరు మంత్రులు ఈ నిర్ణయాన్ని సమరి్ధస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అదనపు ఆదాయం కోసం మద్యం విక్రయానికి మార్గం సుగమం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడమంటే రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుందని నిలదీశారు. ఔరంగాబాద్‌లో విక్రయించండి చూద్దాం: ఇమ్తియాజ్ జలీల్ కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతివ్వాలని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఔరంగాబాద్ ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ లాంటి మహాయోధుడు ఏలిన రాష్ట్రం ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన ఇలాంటి పుణ్యభూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇంకా ఎవరైనా సరే ఔరంగాబాద్‌కు వచ్చి కిరాణ షాపుల్లో వైన్ విక్రయాన్ని ప్రారంభించి చూపాలని సవాలు విసిరారు. ఆ తరువాత షాపులను ధ్వంసం చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, ప్రభుత్వానికి బహిరంగంగా సవాలు విసురుతున్నామని ఇమ్తియాజ్ అన్నారు. వైన్ విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర సంస్కృతిని చెడగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. వైన్ విక్రయాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే చరస్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల పంటలను కూడా పండించేందుకు అనుమతివ్వాలని ఇమ్తియాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీది ద్వంద్వ వైఖరి: భుజ్‌బల్ సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీని రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకోవడానికి అనుమతించిందని, అక్కడ తప్పు కానిది, మహారాష్ట్రలోనే తప్పు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష బీజేపీది ద్వంద్వ వైఖరి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య కచ్చితంగా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ కూడా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో, ప్రభుత్వం పెద్దమొత్తంలో మద్యం విక్రయాలకు, బార్లను సైతం తెరవడానికి అనుమతి ఇచ్చారు. మహారాష్ట్రలోనే బీజేపీకి ఇది తప్పుడు నిర్ణయంగా కనిపిస్తోందా అని మాలిక్ ప్రశ్నించారు. ‘వైన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పానీయంగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిర్ణయం రైతులకు కచ్చితంగా ఆర్థికంగా సహాయపడుతుంది. కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తారు. మా ప్రభుత్వ నిర్ణయ మాత్రం రైతులకు మేలు చేసేందుకే’ అని ఆయన సమర్థించుకున్నారు. అయితే ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్లు వైన్‌ను విక్రయించకూడదని, నిషేధం అమలులో ఉన్న జిల్లాల్లోనూ వైన్ అమ్మకాలను అనుమతించబోమని భుజ్‌బల్ స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రభుత్వం మద్య నిషేధాన్ని ఉపసంహరించుకుందని, మహారాష్ట్రను ‘మద్య’రాష్ట్ర చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. -
మద్యం ప్రియుల్లో ‘నయా’ జోష్ .. తాగండి.. ఊగండి..! కానీ
సాక్షి, పెద్దపల్లి (కరీంనగర్): మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం షాపులకు ఆంక్షలను ఎత్తివేసింది. పైగా అర్ధరాత్రి వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని, బార్లు ఒంటిగంట వరకూ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈవెంట్లు కూడా చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ కావడంతో మద్యంప్రియుల్లో జోష్ నెలకొంది. జిల్లావ్యాప్తంగా 77 మద్యం షాపులు ఉన్నాయి. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కషాప్ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. శుభకార్యాలు ఉంటే మరింత పెరుగుతాయి. అయితే డిసెంబర్ 31 అంటేనే యువతలో తెలియని జోష్ ఉంటుంది. మద్యంతో విందులు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటల వరకే వైన్స్‌షాపులు మూసివేయాలి. కానీ.. ఈ 31న మాత్రం అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటే వెసులుబాటు కల్పించింది. ఈవెంట్లు నిర్వహించుకునేవారు మాత్రం ఎక్సైజ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బయటకొస్తే తాట తీస్తారు.. డిసెంబర్ 31 సందర్భంగా మద్యంషాపులపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం పోలీసులకు మాత్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా గుంపులు, గుంపులుగా కనిపించినా.. తాగి బయటకొచ్చినా పోలీసులు వదలరు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టనున్నారు. ఒకవేళ మద్యం తాగి పోలీసులకు చిక్కితే మాత్రం కటకటాల్లోకి పంపించనున్నారు. ఎవరి ఇళ్లలో వారే పార్టీ చేసుకోవాలని, బయటకొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే జోరందుకున్న అమ్మకాలు డిసెంబర్ 31 నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వైన్స్‌షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని తెలిసినా.. పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే తనిఖీలు చేపడతామని, ఎవరు పట్టుబడినా.. జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలి నిబంధనలు అందరూ పాటించాలి. ఎవరి ఇళ్లలో వారే సెలబ్రేషన్ చేసుకోవాలి. బయటకు రావొద్దు. జనజీవనానికి ఆటంకం కలిగించొద్దు. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం తీసుకెళ్లొచ్చు. అయితే అప్పటికే తాగి ఉండరాదు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ ఉంటుంది. అందులో పట్టుబడితే జైలుకు పంపిస్తాం. ఇందులో అనుమానం లేదు. – ఇంద్రసేనారెడ్డి, సీఐ, సుల్తానాబాద్ చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా -
లిక్కర్ కొనాలంటే ఆధార్‌తో పాటు ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
చెన్నై: దేశంలో కరోనా కేసులు కేరళ, మహారాష్ట్రల తర్వాత తమిళనాడులో అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నియత్రించేందుకు తమిళనాడులోని నీలగిరి జిల్లా అధికారులు వినూత్న నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డాలుగా మారిన వైన్స్ షాపుల వద్ద ఈ నిబంధనలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైన్స్‌లో లిక్కర్ కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో పాటు రెండు డోసులు పూర్తి చేసుకున్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని కండీషన్ పెట్టారు. ఈ రెండు ఉన్న వారికే మద్యం విక్రయిస్తామని లేకపోతే లేదని స్పష్టం చేశారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ దివ్య వెల్లడించారు. చదవండి: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు; లక్ష్మణరేఖ దాటి ప్రవర్తించబోం..! -
ఈ ప్రాంతంలో వింత లాక్డౌన్
మోర్తాడ్(బాల్కొండ): కరోనా వైరస్ ఉధృతిని అరికట్టడానికి గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు సెల్ఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే సెల్ఫ్ లాక్డౌన్ నిబంధనలు మద్యం అమ్మకాలకు వర్తించకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాలు, హోటళ్లు ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయంలో తెరిచి ఉంచాలని ఆయా గ్రామాల పంచాయతీలు, వీడీసీలు తీర్మానించాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రెండు, మూడు రోజుల నుంచి సెల్ఫ్ లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ నిబంధనలు కిరాణ దుకాణాలు, హోటళ్లు, కూరగాయల వ్యాపారం, ఇతరత్రా చిన్న వ్యాపారులకే వర్తింప చేశారు. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలు కాని, బెల్టు షాపులకు ఈ లాక్డౌన్ నిబంధనలు వర్తింప చేయడం లేదు. దీంతో సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటిని బంద్ చేయాల్సి ఉండగా ఇదేమి వింత అని గ్రామస్తులు విస్తుపోతున్నారు. ( చదవండి: నిజామాబాద్‌లో దారుణం.. మున్సిపల్ సిబ్బందిపై దాడి! ) -
రెండు నిమిషాలు ఆలస్యంగా మద్యం తెచ్చాడని...
బంజారాహిల్స్( హైదరాబాద్): బోరబండ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్‌లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్‌మెన్ రంజిత్‌పై అదే సీసాతో తలపై దాడి చేశాడు. దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్‌షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. ( చదవండి: ఆస్పత్రిలో పక్కా ప్లాన్: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి ) -
3 రోజులు..రూ.450 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా ఆంక్షలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారులు భారీ స్థాయిలో లిక్కర్ స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని 20 ఐఎంఎల్ డిపోల నుంచి అమ్మకాలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే దాదాపు రూ. 450 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇంత విలువలో అమ్మకాలు జరిగేందుకు దాదాపు 12 రోజులు పడుతుందని, ఇప్పుడు ధరలు, విక్రయాలు పెరిగిన నేపథ్యంలో 7–10 రోజుల్లోనే ఈ స్టాక్ అమ్ముడవుతుందని బ్రేవరేజెస్ కార్పొరేషన్ వర్గాలంటున్నాయి. (చదవండి: మనో బలం మన సొంతం) రోజుకు 2 లక్షల లిక్కర్ కేసులు.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు బుధవారం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించగా అదే రోజు నుంచి డిపోల ద్వారా విక్రయాలు కూడాప్రారంభమయ్యాయి. అయితే బుధవారమంతా గతంలో తమ వద్ద ఉన్న స్టాక్ అమ్మామని వైన్స్ యజమానులు పేర్కొనగా ఇదే విషయాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా ధ్రువీకరించి వైన్స్ యజమానులకు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ బుధవారం డిపోల నుంచి పెద్ద ఎత్తున లిక్కర్ దుకాణాలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. డిపోల నుంచి ప్రతిరోజూ బ్రేవరేజెస్ కార్పొరేషన్‌కు వచ్చే లెక్కల ప్రకారం బుధవారం రూ. 72 కోట్ల విలువైన ఇండెంట్లు మద్యం షాపుల నుంచి వచ్చాయి. దాని ప్రకారం 72 వేలకుపైగా కేసుల లిక్కర్, 1.12 లక్షల కేసుల బీర్లు దుకాణాలకు చేరాయి. అలాగే గురువారం ఏకంగా 2 లక్షలకుపైగా లిక్కర్ కేసులు వైన్స్ బాట పట్టాయి. బీర్లు అయితే లక్ష కేసులు దాటాయి. శుక్రవారం కూడా ఇదే ఒరవడి కొనసాగింది. గురువారం జరిగిన స్థాయిలోనే శుక్రవారం కూడా డిపోల నుంచి మద్యం రవాణా జరిగింది. దీంతో ఈ మూడు రోజుల్లో 5 లక్షలకుపైగా కేసుల లిక్కర్, 3 లక్షల కేసులకుపైగా బీర్లు రాష్ట్రంలోని 2 వేలకుపైగా ఉన్న మద్యం దుకాణాలకు చేరాయి. తగ్గిన బీర్ల అమ్మకాలు... గతంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే బీర్ల ఇండెంట్ కూడా మూడు రోజులకు 3 లక్షల కేసులు దాటలేదని బీర్ల కంపెనీలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్, మేలలో 45–50 లక్షల చొప్పున బీర్లు అమ్ముడవుతాయి. అంటే రోజుకు కనీసం 1.5 లక్షల బీర్ కేసులు అమ్ముడుపోతాయి. కానీ తాజా ఇండెంట్‌ను పరిశీలిస్తే రోజుకు లక్ష కేసుల బీర్లు కూడా రాలేదు. ఇందుకు రెండు కారణాలున్నాయని బీర్ల కంపెనీలు అంటున్నాయి. లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మినంతగా, బీర్లు అమ్మలేదని, అందుకే స్టాక్ ఉన్న బీర్లు అమ్ముకున్న తర్వాతే మళ్లీ ఇండెంట్లు పెడుతున్నారని చెబుతున్నాయి. దీంతోపాటు ఇళ్లలో లిక్కర్ పెట్టుకున్నంత సులువుగా బీర్లు స్టాక్ పెట్టుకోలేరని, అందుకే నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం లేదని అంటున్నారు. లిక్కర్... లిక్విడ్ స్టాక్ మందుబాబులు మద్యాన్ని విపరీతంగా కొంటున్నారని లిక్కర్ ఇండెంట్ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. మళ్లీ మద్యం షాపులు మూసేస్తారనే అనుమానంతో కొన్ని రోజులకు సరిపడా మద్యం తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. అయితే చీప్‌లిక్కర్ అమ్మకాలు కొంత తగ్గాయని, లేదంటే లిక్కర్ అమ్మకాలు ఇప్పుడు తారస్థాయిలో ఉండేవని వైన్స్ యజమానులు చెబుతున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు, దిగువ మధ్యతరగతికి చెందిన వారు, గ్రామీణ పేదలు, వలస కూలీలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదని వారంటున్నారు. ఇందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన గుడుంబాతోపాటు వేసవిలో ఎక్కువగా లభించే కల్లు కూడా కారణమని తెలుస్తోంది. మొత్తంమీద అమ్మకాలు ఎలా ఉన్నా మందుబాబులు, లిక్కర్ వ్యాపారుల ముందుచూపుతో పెద్ద ఎత్తున సరుకు మాత్రం దుకాణాలకు చేరుకుంటోంది. (చదవండి: ఆన్లైన్లో మద్యం విక్రయంపై ఆలోచించండి) -
మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత
షిల్లాంగ్: మందు తాగడం రాష్ట్ర జీవన విధానంలో భాగమని, అందుకు వైన్ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మారీ రాష్ట్ర సీఎం కొన్రాడ్ కె. సంగ్మాకు శుక్రవారం లేఖ రాశారు. ఎర్నెస్ట్ ప్రస్తుతం ఖాసీ హిల్స్ వైన్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శుక్రవారానికి 3041కి, మరణాల సంఖ్య 90కి చేరింది. (9 గంటలకు.. 9 నిమిషాల పాటు) రాష్ట్రాలవారీగా ప్రకటించిన గణాంకాల మేరకు శుక్రవారం ఒక్కరోజే 534 కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 647 కేసులు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ మత కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించినవి తెలుస్తోంది. (విదేశీ ‘తబ్లిగీ’లపై చర్యలు) -
‘బెల్టు’ అండగా.. గల్లా నిండగా
సాక్షి, ఆసిఫాబాద్ : సరిహద్దు మండలాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు బెల్టు షాప్‌లు అండగా నిలుస్తున్నాయి. బెల్టు షాప్‌ల మాటున అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడుతూ వ్యాపారులు దండుకుంటున్నారు. దీనికి తోడు పొ రుగు రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా మద్యం దుకాణదారులు బెల్టు షాపులతో ఒప్పందం చేసుకుని దందాను సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర గ్రామాలకు విచ్చలవిడిగా మద్యం అక్రమ రవాణా సాగుతోంది. సరిహద్దు జిల్లా అయిన చంద్రాపూర్, గడ్చిరోలిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉండడంతో మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న వైన్స్‌లకు కాసుల వర్షం కురిపిస్తోంది. సరిహద్దుల్లో నిత్యం దందా.. మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోల్లి జిల్లాలో ప్రస్తుతం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. దీంతో బార్డర్లో వైన్సులను దక్కించుకునేందుకు వ్యాపారులు కొత్త దుకాణాల లైసెన్సు పొందే సమయంలో పోటాపోటీగా టెండర్లు వేశారు. ఈక్రమంలో వాంకిడి, సిర్పూర్(టి), కౌటాల, రవీంద్రనగర్, బెజ్జూరు వైన్సులకు ‘మహా’క్రేజీ ఏర్పడింది. అయితే కొంత మంది టెండర్లలో లక్షల రూపాయలు పోగొట్టుకుని మద్యం షాపులు దక్కని వారు లక్కీ లాటరీలో షాపు దక్కించుకున్న వారికి గుడ్‌విల్ కింద లక్షల రూపాయలు ముట్టజెప్పి తిరిగి మద్యం వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఇక కొందరు పెట్టుబడి భరిస్తామని వాటాలు మార్చుకుని దందా సాగిస్తున్నారు. ఈ దందా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వైన్సుల్లో అధికంగా జరిగుతోంది. వాంకిడిలో ఇదే తరహాలో లక్కీడీప్‌లో పొందిన వ్యక్తికి పెద్ద మొత్తంలో గుడ్ విల్ ఇచ్చి ఓ షాపును సొంతం చేసుకుని అడ్డగోలుగా మద్యాన్ని బెల్టుషాపులకు తరలిస్తూ ఆక్రమ సంపాదనకు తెరలేపారు. వైన్స్‌లను తలపిస్తున్న వైనం.. సరిహద్దుల్లో ఉన్న వైన్సుల నుంచి యథేచ్ఛగా నిత్యం మద్యం సరఫరా సాగుతూనే ఉంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, బెల్టుషాపుల కేంద్రంగానే దందా సాగుతోంది. వాంకిడిలో ఉన్న ఓ వైన్ షాపు నేరుగా బెల్టుషాపులను గంప గుత్తగా అడ్వాన్సుగా మద్యం సరఫరా చేస్తూ అక్రమంగా నిల్వలు చేస్తూ సరఫరా చేస్తున్నారు. ఏకచత్రాధిపత్యంగా వాంకిడి మండలం గోయగాంలో ఓ బెల్టుషాపునకు నేరుగా డంప్ చేస్తూ మహా రాష్ట్రకు తరలిస్తున్నారు. వాస్తవానికి మద్యం స్టాక్ ఊట్నూర్ డిపో నుంచి ఎక్సైజ్ అధికారులు సూచించిన గోదాంల్లో నిల్వ ఉంచుకుని అవసర మేర సరఫరా చేస్తూ వైన్సుల్లో విక్రయించాలి. అలా కాకుండా నేరుగా సరిహద్దు గ్రామాల్లో బెల్టుషాపులుకే, అక్కడి నుంచి పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ దండుకుంటున్నారు. ఎమ్మార్పీకి కంటే డబుల్.. పక్క రాష్ట్రంలో నిషేధం అమలులో ఉండడంతో ఇక్కడితో పోల్చితే రెట్టింపు ధరలతో విక్రయాలు సాగిస్తున్నారు. సాధారణంగా వైన్సుల్లో కౌంటర్ విక్రయాలు కంటే బెల్టుషాపులకే నిత్యం పెద్ద మొత్తంలో సరకు రవాణా అవుతుంది. ఈ బలహీనతతో మహారాష్ట్ర నుంచి వచ్చే బెల్టుషాపు నిర్వహకులకు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయాలు చేస్తున్నారు. చీప్ లిక్కర్ క్వాటర్ సీసా రూ.65 ఉంటే మహారాష్ట్ర బెల్టు షాపుల్లో రూ.150 వరకూ విక్రయిస్తున్నారు. ఓసీ క్వాటర్కు ఎమ్మార్పీ రూ.120 ఉంటే స్థానిక బెల్టుషాపుల్లో రూ.150 వరకూ ఉంటే మహారాష్ట్రలో రూ.300 వరకూ అమ్ముతున్నారు. ఇలా ఒక్కో బ్రాండ్‌కు ఒక్కొ తీరుగా రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. అయితే కొంత మంది మరో అడుగు ముందుకేసి సరిహద్దులో అక్రమంగా మద్యం నిల్వ చేసి రూ.20 నుంచి రూ.30 వరకూ అధికంగా ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. వైన్సుల నుంచే.. బెల్టు దుకాణదారులను వైన్సు షాపుల వరకూ రానివ్వకుండా వైన్సుల నుంచి వారి చెంతకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి లకడికోట్, రాజురా చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న గోయగాం లాంటి బెల్టుషాపుల్లోనే అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక సిర్పూర్(టి)సరిహద్దులో ఉన్న పొడ్సా, వెంకట్రావుపేట్, కౌటాల, బెజ్జూరు, చింతలమానెపల్లి మండలం గూడెం గుండా నిత్యం మద్యం తరలిపోతోంది. మహారాష్ట్రలోని ఐరి, ఆల్లపల్లి తదితర ప్రాంతాలకు ప్రాణహిత నదిని దాటించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందా నిలవరించేందుకు వాంకిడిలో ఎక్సైజ్ చెక్‌పోస్టు ఉన్నప్పటికీ అటు పోలీసులు, ఇటు అబ్కారీ శాఖ నిలువరించలేకపోతున్నారనేది బహిరంగ సత్యం. -
మందుబాబుల జేబులు గుల్ల
సాక్షి, గుంటూరు: వైన్ షాపుల ముందు ధరల పట్టిక ఉండాలి.. హోలోగ్రామ్ మిషన్ ఏర్పాటు చేయాలి.. మద్యం హోల్‌సేల్‌గా అమ్మకూడదు.. 21 ఏళ్ల లోపువారికి విక్రయించకూడదు.. ఇవన్నీ మద్యం దుకాణాల వ్యాపారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు. అయితే, నేడు అవి నీటి మీద బుడగల్లా మారాయి. మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి లాభాలే లక్ష్యంగా నిబంధనల్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుగుతున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బార్ కోడింగ్ అమలు, దుకాణాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు, ఆన్లైన్ బిల్లు వంటి నిబంధనలు తప్పనిసరి చేసినా చాలాచోట్ల అమలు కావడం లేదు. నెలకు రూ. 130 కోట్ల వ్యాపారం జిల్లాలో 185 బార్లు, 352 వైన్‌షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ. 3–4కోట్ల చొప్పున నెలకు రూ. 125 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతోంది. జిల్లాలో రోజురోజుకు మద్యం విక్రయాలు పెరగడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రజా ప్రతినిధుల అండదండలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా విక్రయాలు కొనసాగిస్తూ జేబులు నింపుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే కొనండి.. లేకుంటే వెళ్లిపోండనే సమాధానాన్ని మందుబాబులు రుచి చూస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో తెనాలి, రేపల్లె, పల్నాడు సహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్టుషాప్‌లు వెలిశాయి. వీటిని అంతా టీడీపీకి చెందిన వారే నిర్వహించడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం సాహసించలేక పోతున్నారు. మూణ్ణాళ్ల ముచ్చటగా హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం మాన్యువల్ మద్యం అమ్మకాల్లో అక్రమాలను నియంత్రించడం కోసం ఎక్సైజ్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ అమ్మకాల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. హెడోనిక్ పార్ట్ ఫైండర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) విధానం రాష్ట్రవ్యాప్తంగా 2015 జులై 1వ తేదీ నుంచి అన్ని వైన్ షాపులు, బార్లలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా వైన్ షాపుల్లో ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్, డిపో నుంచి మద్యం షాపు వరకు జరిగే విక్రయాలు పూర్తిగా నమోదు అవుతాయి. అయితే, ఇది నామమాత్రంగానే అమలవుతోంది. అధికారులు కేవలం మౌఖికంగానే చెప్పటానికే పరిమితమయ్యారనే విమర్శలు వినవస్తున్నాయి. పలు దుకాణాల్లో కంప్యూటర్ వినియోగం లేకుండా పోయిందని తెలుస్తోంది. హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం సరిగా అమలు కాకపోవడం వల్ల కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడం అధికారులకు సమస్యగా మారుతోంది. ఈ విధానం సరిగా అమలు జరిగితే ఉదయం 10 గంటల కన్నా ముందు, రాత్రి పది గంటల తర్వాత మద్యం అమ్మకాలు జరిపితే అధికారులకు వెంటనే సమాచారం తెలిసిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మడానికి అవకాశం ఉండదు. దీంతో పాటు వినియోగదారులకు కంప్యూటర్ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ నిబంధనలు అన్ని పాటిస్తే తమ లాభాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మద్యం వ్యాపారులు హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానాన్ని పాటించడం లేదు. దీనివల్ల కల్తీ మద్యం బాటిళ్లు పట్టుబడినప్పుడు అవి ఎక్కడి నుంచి తయారై వచ్చాయో గుర్తించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మార్పీకి అదనం జిల్లాలో ఏ మద్యం షాప్ చూసిన ఎమ్మార్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. క్వార్టర్‌కు రూ.5 నుంచి రూ. 10 అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. బీర్ల విక్రయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి కావడంతో డిమాండ్ పెరిగింది. దీంతో కృతిమ కొరత సృష్టించి పలు ప్రాంతాల్లో నిర్వాహకులు బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యాన్ని బాటిల్స్‌లోనే విక్రయించాలి. కానీ జిల్లాలోని అన్ని దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా లూజుగా విక్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఖరీదైన మద్యం సీసాల్లో మధ్య రకం బ్రాండ్లను కలిపి మందుబాబులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. బార్లలో ఎమ్మార్పీ వర్తించవన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని యజమానులు సర్వీసు చార్జీల పేరుతో వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. ఈ విషయాలన్నీ చూసీ చూడనట్టు వదిలేసే ఎక్సైజ్, స్థానిక పోలీసు అధికారులకు నెలనెలా మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు వున్నాయి. కఠినంగా వ్యవహరిస్తాం సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే బార్ కోడింగ్ విధానం అమలులో లేదు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్న విషయం మా దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం.– ఎం. ఆదిశేషు,ప్రొహిబిషన్, ఎక్సైజ్ డీసీ, గుంటూరు -
టోకెన్ కొట్టు.. మద్యం పట్టు: నిజామాబాద్
కాలం మారేకొద్ది మనుషులూ మారుతున్నారు. అంతేనా అంటే రాజకీయ పార్టీలూ మారుతున్నాయి! సభలు, సమావేశాలకు వచ్చేవారికి కాస్తయినా మర్యాద చేయాలి. అందుకు వచ్చినవారికి ఒక్కో టోకెన్ చొప్పున ఇస్తున్నారు. ఆ టోకెన్‌ను సంబంధిత వైన్స్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా రాజకీయ పార్టీలకు వైన్స్‌ల నిర్వాహకులు సహకరించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం అది నేరమంటున్నారు. సాక్షి, కామారెడ్డి క్రైం: రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికలంటేనే డబ్బు, మద్యంతో సావాసం. ఇదివరకు గ్రామంలోని ఓ పార్టీ పెద్దమనిషి చీటి రాసి ఇస్తే కల్లు దుకాణంలో కల్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఎన్నికల వేళ కల్లును ఆశించే వారే లేరు. ప్రచారానికి వచ్చే వారి నుంచి మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మద్యం, నగదులాంటి ప్రలోభాలకు ఓటర్లను గురిచేయడం నేరం. ఇలాంటి నిబంధనలను తప్పించుకుంటూ తమ వారికి మద్యం, నగదు అందించేందుకు ఆయా పార్టీల పెద్దలు కొత్తదారులు వెతుకుతున్నారు. మద్యం దుకాణాల ద్వారా తమ కార్యకర్తలకు మందు సరఫరా చేసేందుకు కొత్తగా టోకెన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు జనాన్ని తరలించిన సందర్భాల్లో, ఇతర ప్రచార కార్యక్రమాల సమయాల్లో మద్యాన్ని నేరుగా ఇవ్వకుండా టోకెన్లు ఇస్తున్నారు. వారిచ్చిన టోకెన్ తీసుకుని వైన్స్‌కు వెళితే ఒక్కో లోకెన్కు ఒక మందు బాటిల్ చొప్పున ఇచ్చేస్తారు. గతంలోనూ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సమయాల్లో ఈ విధమైన పద్ధతులను అనుసరించినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో టోకెన్లకు గిరాకీ బాగా పెరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ వ్యాపారమే పరమావధిగా తీసుకుంటున్న వైన్స్‌ల నిర్వాహకులు పార్టీల పెద్దలకు తమ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మచ్చికతో రాజకీయ మర్యాద.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టోకెన్ పద్ధతిలో మద్యం పంపిణీ నడుస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పార్టీ సమావేశం అనంతరం కొందరు కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఓ పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుడు తనకు పైనుంచి వచ్చిన 70 టోకెన్లు పంచేశానని, మిగిలినవారు అడిగితే ఎక్కడి నుంచి తేవాలనడం ఆశ్చర్యానికి గురిచేసింది. తమ వెంట వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ప్రచారం పూర్తయ్యాక మర్యాదలు చేసేందుకు నేరుగా కొంత డబ్బును, మద్యం టోకెన్లను ఇచ్చుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మద్యం నిల్వలు తమ దగ్గర పెట్టుకునే బాధలేకుండా రాజకీయ పార్టీల నేతలకు వైన్స్‌ల నిర్వాహకులు విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో టోకెన్ పద్ధతిలో మద్యం విక్రయించే వారిపై ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధం.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నేరం. అయినా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. టోకెన్ పద్ధతిలో మద్యం కొనుగోళ్లకు అనుమతి లేదు. రాజకీయ పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు ఇలాంటి పద్ధతులను అవలంబిస్తుండగా దుకాణాల యజమానులు వ్యాపారం ముసుగులో పార్టీలకు సహకారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బెల్టుషాపుల్లో సైతం టోకెన్ సిస్టం అమలవుతోంది. ఇప్పటికే జిల్లాలోని చాలాచోట్ల దాడులు చేసి అక్రమ మద్యం నిల్వలు, రవాణాను ఎక్సైజ్ అధికారులు పట్టుకుని కేసులు చేశారు. టోకెన్ విధానంలో మద్యం విక్రయాలు చేయకూడదని చెబుతున్నారు. తమ దృష్టికి వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
అర్ధరాత్రి మద్యం కొనుగోలు.. పోలీసులు ఏం చేస్తున్నట్టో..
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: అసలే ఎన్నికల సమయం.. ఆపై ఈసారి ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.! పోలీసులు శాంతిభద్రతల నిర్వహణ పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంది. అయితే నిజామాబాద్ నగరంలో బందోబస్తు నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత యథేచ్ఛగా బార్లు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మందుబాబులు రోడ్లపైనే తిరుగుతున్నారు. అత్యవసరం పేరిట, ప్రయాణం చేసి వచ్చే వారిపై వీరితో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణ సమయంలో అర్ధరాత్రి దాటాక మద్యం, బార్లు హోటళ్ల నిర్వహణ విఘాతం కలిగించే అవకాశం ఉంది. పోలీసులు బందోబస్తు పేరిట తనిఖీలు, పెట్రోలింగ్ చేస్తున్నా బార్లు, హోటళ్ల నిర్వహణ మాత్రం కొనసాగుతుండడం గమనార్హం. బయట మూసి, లోపల తెరిచే.. నగరంలో అర్ధరాత్రి తరువాత సైతం మద్యం యథేచ్ఛగా దొరుకుతుంది. నాలుగు ప్రాంతాల్లో బార్ల నిర్వహణ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతుంది. బార్లోనే మద్యం సేవించడమే కాకుండా బయటకు మద్యంను విక్రయిస్తున్నారు. మందుబాబులు రాత్రి సమయంలోనూ కొనుగోళ్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బార్లు రాత్రి 11 గంటలలోపు మూసివేయాలి. అయితే ఇది అమలు కావడం లేదు. శని, ఆదివారాలు సైతం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు సైతం బార్ల నిర్వహణ కొనసాగుతోంది. బయట నుంచి ప్రవేశ మార్గాలు మూసివేయడం, లోపల నిర్వహణ కొనసాగిస్తున్నారు. పెద్దబజారు, లలితమహాల్ థియేటర్ సమీపంలో, వినాయక్‌నగర్ సమీపంలో ప్రజలకు అనేక అసౌకర్యం కలుగుతోంది. రోడ్లపైనే మద్యం తాగుతున్నారు. వచ్చి పోయే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. పోలీసులు ఇటువైపు తనిఖీలు చేయకపోవడం గమనార్హం. అలాగే ఒక బార్ మాత్రం అర్ధరాత్రి వరకు నిర్వహణ కొనసాగుతుండగా ఉదయం 7.30 గంటలకే వెనుకవైపు నుంచి మద్యం విక్రయిస్తున్నారు. సమీపంలోనే వైన్స్ షాపు ఉండగా ఇక్కడ ఉదయం పూటనే మద్యం విక్రయాలు జరుగడం గమనార్హం. అర్ధరాత్రి వరకు బార్ల నిర్వహణ ఉండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలోనే రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దాడులు చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. నగరంలో గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. బందోబస్తు ఏమవుతున్నట్టు... నగరంలో పోలీసుల బందోబస్తు రాత్రివేళలోనూ కొనసాగుతోంది. వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధి లో నాలుగు బీట్లు, మూడో, 4వ టౌన్ పరిధిలో నాలుగు బీట్లు పెట్రోలింగ్ కొనసాగుతోంది. బ్లూ కోట్స్ సిబ్బంది, పెట్రోలింగ్ వాహనాలు రాత్రివే ళలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంతటి బం దోబస్తు నిర్వహిస్తున్న రాత్రివేళలో మాత్రం బారు లు, హోటళ్ల నిర్వహణ కొనసాగుతుండడంపై ప లు విమర్శలు తలెత్తుతున్నాయి. ఎన్నికల సమ యంలో పోలీసులు ఇలాంటివాటిపై చర్యలు తీసుకోకుంటే సమస్యలు ఉప్పతన్నమయ్యే అవకాశం ఉంది. గతంలో రాత్రివేళలో అనేక దాడులు, గొ డవలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అర్ధరాత్రి నిర్వహణపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కఠిన చర్యలు తప్పవు... అర్ధరాత్రి వరకు హోటళ్లు, మద్యం దుకాణాలు నిర్వహణ కొనసాగవద్దు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైన నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలీసు సిబ్బంది రాత్రివేళలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. ఇదివరకే పలు హోటళ్లపై కేసులు కూడా నమోదు చేశాం. –శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ -
పాఠశాలలకు సమీపంలో మద్యం దుకాణమా..!
భోగాపురం: ఓ పక్క ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. మరో పక్క గ్రామదేవత పైడితల్లి అమ్మవారి వనుము.. ఇంకోవైపు జాతీయ రహదారి.. ఇలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ దుకాణం ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. భోగాపురం మండల కేంద్రంలో బట్టికాలువ సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని (లైసెన్స్ జీఎల్ఎస్ నంబర్ 30 (ఏ 4 షాపు) నాయుడు వైన్స్) పోలిపల్లి గ్రామానికి మార్చేందుకు సదరు షాపు యజమాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదే గ్రామానికి చేరువలో వైఎస్సార్సీపీ నాయకుడుకి చెందిన మద్యం దుకాణం ఉంది. అతడిని ఇబ్బంది పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు నాయుడు వైన్స్‌ను అక్కడే ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. అనుకున్నదే తడువుగా పాఠశాల, గ్రామదేవత వనుము, జాతీయ రహదారి మధ్యలో అధికార పార్టీ నాయకుడికి చెందిన స్థలంలో షాపు ఏర్పాటుకి షెడ్ కూడా నిర్మించేశారు. అయితే జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు మాసాల కిందట కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, అబ్కారీశాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సూపరింటిండెంట్, భోగాపురం సీఐ ఇలా ప్రతీ ఒక్కరికీ ఫిర్యాదుతో పాటు షాపు ఏర్పాటు వల్ల ఏర్పడే ఇబ్బందులను వివరించారు. అలాగే ఆ స్థలంలో షాపు పెట్టకుండా నిలుపుదల చేయాలంటూ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ అబ్కారీ శాఖ కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో డిప్యూటీ క మిషనర్ పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం సు ప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం సదరు స్థలంలో షాపు ఏ ర్పాటు చేయడానికి కుదరదంటూ కమిషనర్‌కి ఈ ఏడా ది మార్చి 27న నివేదిక పంపించారు. దీనిపై కమిషనర్ మార్చి 28న విజయవాడలో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి గ్రామస్తుల అభ్యంతరాన్ని నేరుగా తెలుసుకున్నారు. అధికారులపై ఒత్తిడి.. అయితే షాపు పెట్టడానికి అవకాశం లేదన్న విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు ఏకంగా మంత్రులతో అబ్కారీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో మార్చి 30న అబ్కారీశాఖ అధికారులు మళ్లీ షెడ్‌ను పరిశీలించి కొలతలు వేశారు. షాపు పెట్టే స్థలం కూడా అధికార పార్టీ వారికి చెందినది కావడంతో అధికారులు నిబంధనలకు పాతర వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అబ్కారీశాఖ సీఐ బహుదూర్ వద్ద ప్రస్తావించగా, మద్యం దుకాణాన్ని భోగాపురం నుంచి పోలిపల్లికి మార్చేందుకు ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఈ ఫైల్ కమిషనర్ వద్ద ఉందన్నారు. మద్యం షాపు పెట్టేందుకు నిర్మాణం చేసిన షెడ్ నిబంధనల ప్రకారం ఉందా? లేదా? అని ప్రశ్నించగా నిబంధనల ప్రకారం ఉంటే షాపు ఎప్పుడో ప్రారంభమయ్యేది కదా అని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా ఈ అంశం తమ చేతిలో లేదని కమిషనర్ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుందన్నారు. -
మందుబాబులకు చుక్కెదురు..
అమలాపురం టౌన్, రాజమహేంద్రవరం క్రైం:ట్రేడ్ మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు చేపట్టిన నిరసన రెండో రోజు బుధవారం మరింత ఉద్ధృతమైంది. తొలి రోజు జిల్లాలోని మూడు ప్రభుత్వ లిక్కర్ గోడౌన్ల నుంచి మద్యం కొనుగోళ్లు నిలిపేసి ఆ గోడౌన్ల వద్దే నిరసనలు తెలిపిన మద్యం వ్యాపారులు రెండో రోజు నుంచి తమ తమ మద్యం దుకాణాలు, బార్లు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. దీంతో జిల్లాలో బుధవారం 530 మద్యం దుకాణాలు, 40 బార్లు మూతపడ్డాయి. మద్యం దుకాణాల లైసెన్సుదారుల నుంచి ఇంతటి స్థాయిలో, ఇన్ని రోజులు ఎక్సైజ్ శాఖకు నిరసనలు వెల్లువెత్తడం ఇదే ప్రథమం. ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ మార్గమైతే, వాటి అమ్మకాల కోసం లైసెన్సులు పొందిన తమ లాభాలు, ఆదాయాలను మాత్రం ప్రభుత్వం హరిస్తోందని ఆ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలు, బార్లు తెరుచుకోక, మద్యం దొరకక జిల్లా అంతటా మద్యం దుకాణాలు, బార్ల వద్ద బంద్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రెండో రోజూ కూడా జిల్లాలో సుమారు రూ.20 కోట్ల మద్యం సరఫరాకు, దాదాపు రూ. ఆరు కోట్ల మద్యం అమ్మకాలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరం, అమలాపురం, సామర్లకోటల్లో గల బేవరేజెస్ లిక్కర్ గోడౌన్ల కొనుగోళ్లు, బిల్లింగ్‌లు లేక పూర్తిగా మూతబడ్డాయి. మద్యం వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. రాజమహేంద్రవరంలో మద్యం వ్యాపారులు సంబంధిత ఎక్సైజ్ డివిజన్ కార్యాలయంలో ఈఎస్‌కు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమలాపురంలో లిక్కర్ గోడౌన వద్ద వంటా వార్పు పెట్టి వినూత్న నిరసనకు తెర తీశారు. వ్యాపారులు అక్కడే వంటలు వండుకుని అక్కడే సామూహికంగా భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఇలా జిల్లా అంతటా మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు నిరసనలు హోరెత్తించారు. ఈనెల 31వ తేదీ వరకూ మద్యం దుకాణాలను మూసి వేసి బంద్ పాటించేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. 31వ తేదీ వరకు రోజుకో తీరుతో నిరసనలను వినూత్నంగా నిర్వహించేందుకు జిల్లాలోని దాదాపు 600 మంది మద్యం లైసెన్సుదారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో బుధవారం మందు దొరకక కొందరు మందుబాబులు ఆందోళన చెందారు. నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలిసి కొందరు మందుబాబులు ముందుచూపుతో మంగళవారమే స్పందించారు. -
వేడుకలు రెండ్రోజులు వైన్స్, బార్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: హోలీ వేడుకలు నగరంలో రెండు రోజులు జరగనున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం వేడుకలు నిర్వహించనుండగా... రవీంద్రభారతి, ఇందిరాపార్కు, నెక్లెస్ రోడ్, లలిత కళాతోరణం, మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్, శిల్పారామం తదితర ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించనున్నారు. సిటీలో హోలీ పండగకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మార్వాడీలు, రాజస్థాన్ వాసులు శుక్రవారమే హోలీ ఆడాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో వైన్స్, బార్లు పూర్తిగా బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. రాజేంద్రనగర్: రంగుల పండగకురంగం సిద్ధమైంది. కలర్‌ఫుల్‌ఈవెంట్‌లో ఆడిపాడేందుకు సిటీసన్నద్ధమైంది. కానీ.. రసాయనరంగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్న నేపథ్యంలో సహజ రంగులతోనే హోలీ ఆడుకోవాలని నిపుణులుసూచిస్తున్నారు. సిటీజనుల్లోనూఈ స్పృహ పెరిగింది. ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం పరిధిలోని హోమ్‌సైన్స్ కళాశాల సహజ రంగులు సిద్ధం చేసింది. గతేడాది 4టన్నులు తయారు చేయగా, ఈ ఏడాది 7టన్నులుఅందుబాటులో ఉంచింది. రంగులు లభించే ప్రాంతాలు.. సైఫాబాద్ హోమ్‌సైన్స్ కళాశాల, రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణ మఠం, ఎమరాల్డ్ స్వీట్ హౌస్, హైదర్‌నగర్‌లోని 24మంత్ర ఆర్గానిక్ షాప్ తదితర ప్రాంతాల్లో వీటిని విక్రయించనున్నారు. కిలో రూ.400 హోమ్‌సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రకాల రంగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్ కలర్లు ఉన్నాయి. కిలో రంగును రూ.400 విక్రయిస్తున్నారు. పావు కిలో, అర్ధ కిలో, కిలో చొప్పున ప్యాకింగ్‌లు కూడా చేశారు. మరిన్ని వివరాలకు: 7032823265, 7331175251, 040–23244058. పెరుగుతున్న డిమాండ్.. ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న రంగులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది రంగుల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రంగులను తయారు చేస్తున్నాం. మార్కెట్లో విక్రయించేందుకు కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశాం. – గీతారెడ్డి, సహజ రంగుల ప్రాజెక్ట్ ప్రిన్సిపల్, హోమ్‌సైన్స్ కాలేజీ ఉపయోగాలు... ♦ ఈ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ♦ శరీరానికి, కళ్లకు ఎలాంటి హానీ చేయవు. ♦ పర్యావరణంపై ప్రభావం చూపవు. ♦ శుభ్రపరుచుకోవడం చాలా తేలిక. ♦ నీరు ఆదా అవుతుంది.. ఖర్చు తక్కువ. ♦ భూమిలో ఈ రంగుల నీరు ఇంకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక వాడం.. సహజ రంగులతోనే హోలీ ఆడాలని నిర్ణయించాం. ఇక నుంచి రసాయన రంగులు వాడం. రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్లో రంగులు కొనుగోలు చేశాం. – కె.వనజ, హైదర్‌గూడ -
ఎం.ఆర్.పి అక్రమాలకు కళ్లెం
సంగారెడ్డి క్రైం: మాగ్జిమం రిటైల్ ప్రైస్ (ఎం.ఆర్.పి.) ధరల కంటే అధిక రేట్లకు మద్యం విక్రయించడం, ఒక బ్రాండ్‌కు బదులు మరోటి ఇవ్వడం.. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై యజమానులు దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి అక్రమాలను నియంత్రించడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పూనుకుంది. ఆన్‌లైన్‌తో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో జరిగే అవకతవకలకు కళ్లెం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను రూపొందించారు. దాని ద్వారా మద్యం అధిక ధరలను నియంత్రించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడాన్ని అరికట్టనుంది. గతంలో మద్యం దుకాణాల నిర్వాహకులు అధికారికంగా కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి మిగిలిన మద్యాన్ని దొడ్డిదారిన తెచ్చుకొని కల్తీ చేసి అంటగట్టి లాభాలు ఆర్జించిన సంఘటనలు కోకొల్లలు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖపై వచ్చిన విమర్శల దృష్ట్యా ఆ శాఖ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. మద్యం ధరలను ఎమ్మార్పీకే విక్రయించేలా చూడడంతోపాటు దుకాణాదారులు దొడ్డిదారిన తెచ్చుకునే సరుకును సైతం అడ్డుకునేందుకు యాప్ విడుదల చేసింది. యాప్‌ను ఉపయోగించే విధానం రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే 800 పైచిలుకు మద్యం బ్రాండ్ల ధరలను సైజులవారీగా కచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎమ్మార్పీ విషయంలో ఏదైనా దుకాణ యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే యాప్ నుంచే ఫిర్యాదు చేయడానికి వీలుంది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఫోన్ నంబర్‌తో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం సైజ్ లేక ప్రైస్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు కావాలి్సన బ్రాండ్‌ను నమోదు చేసుకోమని అడుగుతుంది. అనంతరం మీరు ఎంటర్ చేసిన బ్రాండ్ లభించే పరిమాణం, ఎమ్మార్పీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫిర్యాదులు ఇలా చేసుకోవచ్చు.. దుకాణ యజమానులు ఎంత ధరకు మద్యాన్ని అమ్మారో, దుకాణం పేరు, అడ్రస్, ఫిర్యాదుదారుడి పేరు, మొబైల్ నంబర్, సంబంధిత దుకాణం ఫొటో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన అనంతరం కొన్ని వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. దుకాణాల వద్ద అపరిశుభ్రత, పరిసరాలు తదితర విషయాలు, కల్తీ, దుకాణ సిబ్బంది దురుసు ప్రవర్తన, అర్ధరాత్రి అమ్మకాలు సాగించినా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం మద్యం దుకాణాల్లో అధిక ధరలను నియంత్రించడానికి, యాజమాన్యాలు, వినియోగదారుల మధ్య ప్రవర్తనలో మార్పులకు సీసీ కెమెరాల ఏర్పాటు దోహదం చేస్తుంది. ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎమ్మార్పీ ధరలకన్నా అధిక రేట్లకు అమ్మకుండా చర్యలు తీసుకున్నాం. అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు అన్ని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లపై నిఘా పెట్టాం. – ఏబీకే శాస్త్రి, ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ వాట్సప్ ద్వారా.. మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు వైన్ షాపు యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారులు వాట్సాప్ నంబర్ 7989911122 ద్వారా కానీ టోల్ ఫ్రీ నంబర్ 1800–4252–523 ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్‌కు ఒక సంఖ్య వస్తుంది. కేటాయించిన నంబర్ ఆధారంగా చర్యలు తీసుకున్న వివరాలను ఎక్సైజ్ శాఖ తెలియజేస్తుంది. ఉమ్మడి జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో 191 మద్యం దుకాణాలు, 29బార్ అండ్ రెస్టారెంట్లలో ఒక్కో దుకాణం వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కనీసం 440 సీసీ కెమెరాల నిఘాలోకి మద్యం దుకాణాల క్రయ, విక్రయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పా టు వల్ల ఎలాంటి గొడవలు జరిగినా తెలిసిపోయే అవకాశముంది. -
బెల్ట్ షాపులతో కాపురాలు నాశనం
నాగలక్ష్మి: సార్ మాది మూడిళ్లపల్లె గ్రామం. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో నేను బిజినెస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నా. నా భర్తకు 27 ఏళ్లు సార్... ఈ వయస్సుకే 24 గంటలూ తాగి మత్తుగా పడి ఉంటాడు. నాకు జీతంగా వచ్చే రూ.ఆరు వేలు అతని తాగుడుకే సరిపోకపోవడంతో రోజూ ఇంట్లో గొడవలే. ఉన్న నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నిస్తే ఎదురుతిరిగా. పొలాన్ని ఎలాగయినా అమ్మాల్సిందేనని అతను, వద్దని నేను. మా ఊళ్లో బెల్ట్‌షాపు లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. మీ కాళ్లకు దండం పెడతా, బెల్ట్ షాపులు మూయించి పుణ్యం కట్టుకోండి సార్.. జగన్: నిజమే తల్లీ.. తాగుడుతో మనుషుల మధ్య, కుటుంబాలలో ఆత్మీయతలు, అప్యాయతలు తరిగిపోతున్నాయి. అందుకే మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలనుకుంటున్నాం. పిల్లలెంతమంది? ఏం చదువుతున్నారు? నాగలక్ష్మి: ఇద్దరు పిల్లలు సార్. దగ్గర్లో ఉన్న జ్ఞానజ్యోతి స్కూల్లో చదివించుకుంటున్నా. బెల్ట్‌షాప్‌లు తీసేయించాలని చాలామంది నాయకులను అడిగా. ఎవ్వరూ ఏమీ చేయలేదు. మీ పాదయాత్ర మా ఊరిమీదుగా పోతున్నదని తెలిసి నా ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చా. బెల్ట్‌షాపులు మూయిస్తే నీకు మేం ఆజన్మాంతం రుణపడి ఉంటా. జగన్: తప్పనిసరిగా తల్లీ. కాస్తంత ఒపిక పట్టండి. మన ప్రభుత్వం రాగానే మీ ఊళ్లో బెల్ట్ షాపు లేకుండా చేస్తా. దశల వారీగా మద్య నిషేధాన్ని తీసుకువస్తాం. పార్వతమ్మ (పెద్ద జొన్నవరం): అయ్యా, మందుతో ఊళ్లకు ఊళ్లు తాగుబోతులవుతున్నారయ్యా, అప్పులు చేసి పొలం అమ్ముతానంటున్నారయ్యా.. జగన్: అవునమ్మా, తప్పని సరిగా చేద్దాం, మద్య నిషేధాన్ని అమలు చేద్దాం. – ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
వారెవ్వా.. గ‘మ్మత్తు’ ఐడియా..!
తిమ్మాజిపేట: మద్యం అమ్మడం కోసం ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోరు అనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ప్రధాన రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొత్తగా లక్కీ డ్రాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులకు అక్టోబర్ ఒకటవ తేదీనే ప్రధాన రహదారికి 225 మీటర్ల దూరంలో వైన్స్‌షాపులను ఏర్పాటు చేసుకోవడం కష్టతరమైంది. చేసేదిలేక నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట అయ్యప్ప వైన్స్ షాప్ యజమాని షాపు నిర్మాణం జరిగే వరకు ఓ పాత కంటెయినర్‌ను పట్టుకొచ్చాడు. ఇందులోనే దుకాణాన్ని ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టాడు. కంటెయినర్లో వైన్ షాపును ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
హైవేలపై షాపులకు ఊరట..
► సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు ► హైవేలపై మద్యం షాపుల తరలింపునకు బ్రేక్ ► సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వరంగల్: జాతీయ రహదారులకు అతి స మీపంలో ఉన్న బార్లు, వైన్స్ షాపులను తొలగించాలన్న గడువును పెంచుతూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో మ ద్యం వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. హైవేలపై ఉన్న బార్లు, వైన్స్ షాపులను 2017మార్చి 31వ తేదీ నాటికి తరలించాని సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 15వ తేదిన తీర్పు ఇచ్చింది. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు ఉండడం వల్ల వా హనాల డ్రైవర్లు మద్యం సేవించి నడపడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈనేపథ్యంలో మద్యం దుకాణాలను జాతీ య రహదారికి కనీసం 500మీటర్ల దూరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 252వైన్స్ షాపులు, 95వరకు బార్లు ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 134 వైన్స్ షాపులకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వైన్స్ షాప్స్‌కు మాత్రమే వర్తిస్తాయని, బార్లుకు వర్తించవని కేరళ ప్ర భుత్వం ఆటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను అశ్రయించింది. కేరళ ప్రభుత్వం వినతిపై పరిశీలన చేసి ఆటార్నీ జనరల్ సుప్రీం తీర్పు వైన్స్‌కు వర్తిస్తాయని, బార్లకు వర్తించవని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొనడంతో ఎక్సైజ్ అధికారులు బార్లకు నోటీస్‌లు జారీ చేయలేదు. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పులో బార్లను సైతం తొలగించాలని ఉండడంతో బార్లు సెప్టెంబర్ వరకు రహదారులపై కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 30వరకు గడువు... రాష్ట్ర ప్రభుత్వం తన మద్యం పాలసీని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చినందున హైవేలపై మద్యం షాపుల తొలగింపు గడువును సెప్టెంబర్ నెలాఖరుకు వర కు పొడగించాలని కోరిన నేపథ్యంలో సు ప్రీం కోర్టు గడువును పెంచడంతో ఎక్సైజ్ అ« ధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వ రకు వైన్స్ షాపులే తరలించాలని ఉండగా, తాజాగా బార్లు కూడా నిబంధనల పాటిం చాలని కోర్టు పేర్కొనడంతో బారు షాపుల యజమానుల్లో అలజడి మొదలయింది. -
మద్యం షాపులపై ‘సుప్రీం’ ఆదేశాలు పాటించాలి
ఐద్వా సంఘ సభ్యుల డిమాండ్ సామర్లకోట (పెద్దాపురం) : హైవే సమీపంలో మ ద్యం షాపులు ఉండరాదన్న సుప్రీం కోర్టు తీర్పును తప్పనిసరిగా పాటించాలని ఐద్వా మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో ఈ మేరకు ఆదివారం సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. హైవేలో మద్యం షాపులు ఉన్నందున మద్యం సేవించిన డ్రైవర్లతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఐద్వా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.లక్ష్మి, కె. వరలక్ష్మి ఆరోపించారు. బైపాస్, ఏడీబీ రోడ్డు మార్జిన్లలో ఉన్న దాబాలు బార్లుగా మారిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. రాత్రిళ్లు దాబాల్లో మద్యం సేవించిన యువకులు తరచూ ఘర్షణలకు దిగుతున్నారన్నారు. అలాగే బెల్టుషాపులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైవే, ఏడీబీ రోడ్లకు కిలోమీటరు దూరంలో మద్యం షాపులు ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ సంతకాలు సేకరించారు. సంతకాలతో ఉన్న పత్రాలను సీఎం చంద్రబాబుకు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎ.మంగతాయారు, దుర్గ, సీహెచ్ పార్వతి, బి.దుర్గ పాల్గొన్నారు. -
ఎమ్మార్పీ రేట్లకే మద్యం: పద్మారావు
హైదరాబాద్: దసరాకల్లా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిపిస్తామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో మంళగవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో 107 వైన్స్ షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫునే ఆ షాపులను నిర్వహిస్తామని వెల్లడించారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మేలా చర్యలు చేపడతామని పద్మారావు తెలిపారు.