హైవేలపై షాపులకు ఊరట..
► సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు
► హైవేలపై మద్యం షాపుల తరలింపునకు బ్రేక్
► సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
వరంగల్: జాతీయ రహదారులకు అతి స మీపంలో ఉన్న బార్లు, వైన్స్ షాపులను తొలగించాలన్న గడువును పెంచుతూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో మ ద్యం వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. హైవేలపై ఉన్న బార్లు, వైన్స్ షాపులను 2017మార్చి 31వ తేదీ నాటికి తరలించాని సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 15వ తేదిన తీర్పు ఇచ్చింది. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు ఉండడం వల్ల వా హనాల డ్రైవర్లు మద్యం సేవించి నడపడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చింది.
ఈనేపథ్యంలో మద్యం దుకాణాలను జాతీ య రహదారికి కనీసం 500మీటర్ల దూరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 252వైన్స్ షాపులు, 95వరకు బార్లు ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 134 వైన్స్ షాపులకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వైన్స్ షాప్స్‌కు మాత్రమే వర్తిస్తాయని, బార్లుకు వర్తించవని కేరళ ప్ర భుత్వం ఆటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను అశ్రయించింది.
కేరళ ప్రభుత్వం వినతిపై పరిశీలన చేసి ఆటార్నీ జనరల్ సుప్రీం తీర్పు వైన్స్‌కు వర్తిస్తాయని, బార్లకు వర్తించవని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొనడంతో ఎక్సైజ్ అధికారులు బార్లకు నోటీస్‌లు జారీ చేయలేదు. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పులో బార్లను సైతం తొలగించాలని ఉండడంతో బార్లు సెప్టెంబర్ వరకు రహదారులపై కొనసాగనున్నాయి.
సెప్టెంబర్ 30వరకు గడువు...
రాష్ట్ర ప్రభుత్వం తన మద్యం పాలసీని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చినందున హైవేలపై మద్యం షాపుల తొలగింపు గడువును సెప్టెంబర్ నెలాఖరుకు వర కు పొడగించాలని కోరిన నేపథ్యంలో సు ప్రీం కోర్టు గడువును పెంచడంతో ఎక్సైజ్ అ« ధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వ రకు వైన్స్ షాపులే తరలించాలని ఉండగా, తాజాగా బార్లు కూడా నిబంధనల పాటిం చాలని కోర్టు పేర్కొనడంతో బారు షాపుల యజమానుల్లో అలజడి మొదలయింది.