హైదరాబాద్: దసరాకల్లా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిపిస్తామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో మంళగవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో 107 వైన్స్ షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫునే ఆ షాపులను నిర్వహిస్తామని వెల్లడించారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మేలా చర్యలు చేపడతామని పద్మారావు తెలిపారు.
ఎమ్మార్పీ రేట్లకే మద్యం: పద్మారావు
Published Tue, Aug 26 2014 1:49 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement