సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో విశిష్ట సేవలు అందించిన కళాశాలలు, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, ప్రోగ్రామ్ అధికారులు, ఉత్తమ వలంటీర్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సత్కరించి ఇందిరా గాంధీ జాతీయ సేవాపథకం అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 53 సంస్థలు, వ్యక్తులకు అవార్డులు అందచేశారు. తెలంగాణకు ఆరు, ఏపీకి 9 అవార్డులు దక్కాయి.
అవార్డు గ్రహీతల వివరాలు..
‘అప్‌కమింగ్’ వర్సిటీ విభాగంలో ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్. రాజు, వైస్ చాన్స్‌లర్(ఆంధ్రా వర్సిటీ), డాక్టర్ ఎన్.ఎ. ధరణి పాల్(ఆంధ్రా వర్సిటీ), ‘అప్రీసియేషన్’ విభాగంలో డాక్టర్ బి.సురేష్‌లాల్(కాకతీయ వర్సిటీ)లకు అవార్డులు లభించాయి. ఉత్తమ యూనిట్/ప్రోగ్రాం అధికారుల విభాగంలో ిసీహెచ్. శ్రీనివాస్-ప్రిన్సిపాల్, రాపోలు గోపీకృష్ణ(వివేకానంద డిగ్రీ- పీజీ కళాశాల, కరీంనగర్), బి.మధుసూదన్‌రెడ్డి-ప్రిన్సిపాల్, కల్వకుంట రామకృష్ణ(ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కరీంనగర్), ఎ.సుధాకర్-ప్రిన్సిపాల్, మద్దినేని సుధాకర్(ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చోడవరం, గుంటూరు), డి.సుధారాణి- ప్రిన్సిపాల్(ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల, శివాజీపాలెం, విశాఖపట్నం), చిళ్ల ఆదినారాయణ(ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల, శివాజీ పాలెం, గుంటూరు)లకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ విభాగంలో ఎన్.రాహుల్ పాల్(ఆంధ్రా వర్సిటీ), కె.కృష్ణ (శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ), కందూరి రోహిణి(జేబీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కావలి), కె.అవంతి(వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కరీంనగర్) లకు పురస్కారాలు దక్కాయి.
ఇందిర ఎన్‌ఎస్‌ఎస్ అవార్డుల ప్రదానం
Published Thu, Nov 20 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement