Indira Gadhi
-
కాంగ్రెస్‌కు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదు: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటితో (జూన్ 25) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలుగా మార్చిందని మండిపడ్డారు.ఈ మేరకు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మోదీ గట్టిగా బదులిచ్చారు. అత్యవసర స్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే హక్కు హస్తం పార్టీకి లేదని విమర్శలు గుప్పించారు.ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రాథమిక స్వేచ్ఛను ఎలా కాంగ్రెస్ తుంగలో తొక్కిందని అన్నారు. ఎమర్జెన్సీ ప్రజలకు ‘చీకటి రోజులు’గా మారిందని విమర్శించారు.Today is a day to pay homage to all those great men and women who resisted the Emergency.The #DarkDaysOfEmergency remind us of how the Congress Party subverted basic freedoms and trampled over the Constitution of India which every Indian respects greatly.— Narendra Modi (@narendramodi) June 25, 2024 ‘ఎమర్జెన్సీని ప్రతిఘటించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, ప్రతి భారతీయుడూ గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుంగలో తొక్కింది. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైలుపాలు చేసింది. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు, వేధించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు.Just to cling on to power, the then Congress Government disregarded every democratic principle and made the nation into a jail. Any person who disagreed with the Congress was tortured and harassed. Socially regressive policies were unleashed to target the weakest sections.— Narendra Modi (@narendramodi) June 25, 2024 ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే నైతిక హక్కు లేదు. ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించింది. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే ఎన్నో బిల్లులను తెచ్చారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారు. రాజ్యాంగంలోని ప్రతిఅంశాన్ని ఉల్లంఘించారు. The mindset which led to the imposition of the Emergency is very much alive among the same Party which imposed it. They hide their disdain for the Constitution through their tokenism but the people of India have seen through their antics and that is why they have rejected them…— Narendra Modi (@narendramodi) June 25, 2024 కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉంది. రాజ్యాంగంపై వారికి ఉన్న అయిష్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు నటిస్తున్నారు. అయితే, వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పదేపదే కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు.Those who imposed the Emergency have no right to profess their love for our Constitution. These are the same people who have imposed Article 356 on innumerable occasions, got a Bill to destroy press freedom, destroyed federalism and violated every aspect of the Constitution.— Narendra Modi (@narendramodi) June 25, 2024 కాగా జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ సమయంలో పౌర హక్కులను హరించివేశారు. ప్రతిపక్ష నాయకులు, అసమ్మతివాదులు, అనేకమంది ప్రజలు జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టారు. ఇది 1977 వరకు 21 నెలల పాటు అమలులో ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటిగా ఉండిపోయింది. -
నానమ్మ ఇందిరపై వరుణ్ గాంధీ ప్రశంసలు.. కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎంపీ?
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ.. నిజమైన నాయకులు గెలుపు వల్ల లభించిన పేరు ప్రతిష్టలను తన తన ఖాతాలోనే వేసుకోరని అన్నారు. ఈ మేరకు 1971 యుద్ధంలో భారత్ చారిత్రాత్మక విజయం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షాకు ఇందిరా రాసిన లేఖను వరుణ్ గాంధీ షేర్ చేశారు. ‘మొత్తం జట్టు కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం లభిస్తుందని నిజమైన నాయకుడికి తెలుసు. విజయంతో వచ్చిన కీర్తి ప్రతిష్టలను వారు ఒక్కరే స్వీకరించరు. ఎప్పుడూ ఎలా విశాల హృదయంతో ఉండాలో ఆ నేతకు తెలుసు’ అని వరుణ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారి తీసిన విజయం గురించి గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు భారతదేశం మొత్తం ఈ ఇద్దర్ని జాతీయసంపదగా భావిస్తోందని, వారికి వందనం చేస్తుందని అన్నారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. ఈమధ్య పార్టీ విషయాల్లో అంటీముట్టనట్లు వ్యహరిస్తున్నారు. కీలక విషయాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతకాలంగా తన లోక్‌సభ నియోజకవర్గమైన పిలిభిత్‌లో క్రియాశీలంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. వీటిని బలపరిచేలా గత నెలలో ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ పుణ్యక్షేత్ర సందర్శనకు వేర్వేరుగా వెళ్లిన రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ.. ఆలయం బయట కలుకొని అప్యాయంగా పలకరించుకున్నారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరు నేతలు చెప్పుకొచ్చారు. తాజా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. చదవండి: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు -
ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి?
ఆ రోజు సుప్రీం కోర్టులో ఆసక్తికర వాతావరణం నెలకొంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరగనున్నదోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు జరిగే ఒక ప్రత్యేక కేసు విచారణలో సాక్ష్యం చెప్పేందుకు ఒక ప్రముఖ వ్యక్తి హాజరుకావాల్సి ఉంది. ఆ ప్రముఖుని కోసం ఒక సోఫాను హాలులో ఏర్పాటు చేశారు. సాక్షి కోసం సుప్రీంకోర్టు డాక్లో సోఫాను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి, చివరిసారి. నిజానికి ఆ రోజు సుప్రీంకోర్టు నిర్ణయాలను రద్దు చేసే అధికారం కలిగిన వ్యక్తి స్వయంగా సాక్ష్యం చెప్పేందుకు రాబోతున్నారు. అతనే దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి... ఆరోజు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యునిగా.. సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా దేశాధ్యక్ష్య పదవిలో ఉంటూ, ఆయనే స్వయంగా వాంగ్మూలం ఇవ్వడానికి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మళ్లీ అలాంటి దృశ్యం కనిపించలేదు. అది 1970వ సంవత్సరం. చట్టపరమైన మినహాయింపు ఉన్నప్పటికీ, అప్పటి రాష్ట్రపతి వివి గిరి కోర్టుకు హాజరై, తన వాంగ్మూలాన్ని వినిపించారు. భారత నాల్గవ రాష్ట్రపతి అయిన వీవీ గిరి 1894 ఆగస్టు 10న ఒరిస్సాలోని బ్రహ్మపూర్‌లో జన్మించారు. అతని తండ్రి వివి జోగయ్య పంతులు న్యాయవాది. భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యుడు. వీవీ గిరి 1913లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు ఐర్లాండ్ వెళ్లారు. తరువాత్ భారత్ తిరిగివచ్చి బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. తాత్కాలిక రాష్ట్రపతిగా నియామకం దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి కార్మికనేతగానూ పేరుగాంచారు. 1928లో ఆయన నాయకత్వంలో రైల్వే కార్మికుల అహింసాయుత సమ్మె జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం, రైల్వే యాజమాన్యం కార్మికుల డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమంలో కార్మిక సంఘాలను భాగస్వాములను చేసిన ఘనత కూడా వివి గిరికి దక్కుతుంది. కాగా దేశ మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1969 మే 13న మరణించారు. అనంతరం వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ సిండికేట్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందిరా గాంధీ వ్యతిరేకతను పట్టించుకోకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు సిండికేట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇందిరా గాంధీ.. వివి గిరికి మద్దతు ప్రకటించారు. 1969 ఆగస్టు 16న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో నీలం సంజీవ రెడ్డి, వివి గిరి, ప్రతిపక్ష అభ్యర్థి సీడీ దేశ్‌ముఖ్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వివి గిరి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతలో ఆయనకు 48 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఆయనకే మెజారిటీ వచ్చింది. అయితే వీవీ గిరి ఎన్నిక చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తప్పుడు పద్ధతులను ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. భారతరత్నతో సత్కారం ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్రపతి వీవీ గిరి స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై సాక్షిగా విచారణలో పాల్గొన్నారు. చివరకు సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి, వీవీ గిరి ఎన్నికను సమర్థించింది. వీవీ గిరి 1969 ఆగస్టు 24 నుంచి 1974 ఆగస్టు 24 వరకూ రాష్ట్రపతి పదవిని చేపట్టారు ఆయన తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి అయ్యారు. 1975లో వీవీగిరి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. వీవీ గిరి తన 85 సంవత్సరాల వయస్సులో 1980 జూన్ 24న మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) మరణించారు. ఇది కూడా చదవండి: ఆ ఒక్క జవాను.. పాక్ ఆశలను పటాపంచలు చేశాడు! -
‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్నచీరతో’..
అది 1984, అక్టోబరు 31.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఎవరూ ఊహించని విధంగా ఒక ఘటన చోటుచేసుకుంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని రక్తమోడుతున్న స్థితిలో బుల్లెట్ గాయాలతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆ పరిస్థితిని మాటల్లో వర్ణించడం కష్టం. ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీకి శస్త్ర చికిత్స చేసి, ఆమె శరీరం నుంచి బుల్లెట్లు వెలికితీసిన డాక్టర్ పి వేణుగోపాల్ నాటి ఆ భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోలేదు. ఆరోజు ఇందిరాగాంధీ ప్రాణాలు కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యులు, సర్జన్లు,నర్సింగ్ సిబ్బంది నాలుగు గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేశారని నాటి తన జ్ఞాపకాల దొంతరలోని వివరాలను వెల్లడించారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ పుస్తకంలో.. వేణుగోపాల్ ఆ రోజల్లో ఎయిమ్స్ కార్డియాక్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1994 ఆగస్టులో భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడిని నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. ఇటీవల ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రాసిన పుస్తకం విడుదలైంది. రక్తంతో తడిసిన ఆమె చీరలోంచి నేలపైకి జారి పడిన బుల్లెట్లు, రక్తమార్పిడి, తదుపరి ప్రధాని ప్రమాణ స్వీకారంపై ఆసుపత్రి కారిడార్‌లో జరిగిన రాజకీయ చర్చ... ఇవన్నీ 39 ఏళ్ల తర్వాత కూడా నాకు స్పష్టంగా గుర్తున్నాయని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ శరీరం చుట్టూ రక్తపు మడుగు మంచం మీద కదలలేని స్థితిలో ఉన్న ఇందారాగాంధీని చూసి తాను చలించిపోయానని ఆయన ఆ పుస్తకంలో రాశారు. ఆ సమయంలో ఆమె కడుపులో నుంచి రక్తం కారుతోంది. ఆమె శరీరం రక్తంతో పూర్తిగా తడిసిపోయింది. మొహం పాలిపోయింది. శరీరంలోని రక్తం అంతా వేగంగా బయటకు ఉబికివచ్చింది. అక్కడ రక్తపు మడుగు ఏర్పడింది. ఇందిరాగాంధీని ఆమె నివాసంలోని లాన్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు హత్య చేశారు. దుండగులు ఆమెపై 33 బుల్లెట్లు కాల్చారు. వాటిలో 30 ఆమెను తాకాయి. 23 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. ఏడు బుల్లెట్లు మరింత లోపలికి దూసుకెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం.. వేణుగోపాల్ (81) ఆ పుస్తకంలో నాటి వివరాలను తెలియజేస్తూ ఇందిరా గాంధీకి ఓ-నెగటివ్ రక్తం అవసరమయ్యింది. ఆ రక్తం వెంటనే లభించలేదు. ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం నెలకొంది. ఎయిమ్స్ సిబ్బంది అక్కడకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదే రోజు డైరెక్టర్‌గా తన బాధ్యతలకు వీడ్కోలు చెబుతున్న టాండన్.. బాధ్యతలు స్వీకరించబోతున్న డాక్టర్ స్నేహ భార్గవ.. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏం చెయ్యాలా? అనే సందేహంతో నా వైపు చూశారు. కార్డియాక్ సర్జరీ విభాగం అధిపతిగా నేను వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రక్తస్రావం ఆపడానికి నేను ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించాను. ముందుగా ఇందిరాగాంధీ శరీరం నుంచి కారుతున్న రక్తస్రావాన్ని బైపాస్ మిషన్ సహాయంతో ఆపాలన్నది నా ప్లాన్. ఇందుకోసం నాలుగు గంటల పాటు వైద్యసిబ్బంది అంతా పోరాడారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇందిరా గాంధీ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ వార్త బయటివారికి ఎంతో నిస్సహాయ స్థితిలో తెలియజేశాను. దేశంలోని తూర్పు ప్రాంతంలో పర్యటిస్తున్న రాజీవ్ గాంధీ ఎయిమ్స్‌కు వస్తున్నారని, ఆయన రాక కోసం వేచి చూడాలని సిబ్బంది అభిప్రాయపడ్డారు. ‘అదే జరిగివుంటే బతికేవారు’ దేశంలో 50,000 గుండె శస్త్రచికిత్సలు చేసిన వేణుగోపాల్ ఆ పుస్తకంలో మరో కీలక విషయం రాశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదటి బుల్లెట్ తగిలిన వెంటనే కిందపడిపోయారని, ఆమెతో పాటు ఉన్నవారు ఆమెను నేలపై ఒంటరిగా వదిలి, వెనక్కి పరిగెత్తారని తనకు తెలిసిందని, వారు అలా చేయకుండా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించివుంటే ఆమె బతికేవారని వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే ఆమెతో పాటు ఉన్నవారు అక్కడి నుంచి పారిపోవడం హంతకుడిలో ధైర్యాన్ని నింపిందని, ఫలితంగానే అతను తన మెషిన్ గన్ నుండి పలు రౌండ్ల బుల్లెట్లను కాల్చగలిగాడని వేణుగోపాల్ ఆపుస్తకంలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు -
రెండు దేశాలకు మంచిది కాదు.. భారత విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: కెనడాలో బ్రాంప్టన్ నగరంలో ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ఉత్సవాల్లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఒక శకటంపై ప్రదర్శిస్తూ 5కి.మీ మేర ర్యాలీ చేసి భారతదేశ ప్రతిష్టను మంటగలిపేలా ప్రవర్తించారు. దీనిపై స్పందిస్తూ ఈ హేయమైన చర్యకు పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రాష్ట్ర వ్యవహారాల మంత్రి మీనాక్షి లేఖి. పాశవికమైన చర్య.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఒకరిని హత్య చేయడమనేది నేరంగానే పరిగణిస్తారు. ఇలా వేరొకరి హత్యను బట్టి ఆనందిస్తూ సంబరాల్లా జరుపుకోవడం పాశవికం. దీన్ని శాంతిభద్రతల ఉల్లంఘనగా పరిగణించి కెనడా ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం.. అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ హేయమైన చర్యపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇటువంటి చర్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదన్నారు. ఈ సంఘటన వెనుక అంతర్లీనంగా మరో కారణం దాగుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఎవరైనా ఇలాంటి దారుణానికి ఒడిగడతారా? ఇది వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను ప్రేరేపించేవారి చర్యే. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలకు కెనడా దేశానికి కూడా మంచిది కాదని అన్నారు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
కెనడాలో ఇందిరా గాంధీకి ఘోర అవమానం!
కెనడా: కెనడాలో ఆపరేషన్ బ్లూస్టార్ 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని రిక్రియేట్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దీన్ని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, మిలింద్ దేవర. శకటంపై ప్రదర్శన... ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట 1984లో ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జూన్ 6న భారత సైనిక బలగాలు స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించాయి. దానికి ప్రతిగా అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది అత్యంత కిరాతకంగా కాల్పులు చేసి హతమార్చారు. ఇది జరిగి 39 ఏళ్ళు పూర్తైన నేపథ్యంలో కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్థాన్ మద్దతుదారులు 5 కి.మీ మేర పెరేడ్ నిర్వహించారు. ఆ సంఘటనను కళ్ళకు కడుతూ శకటంపై ఆనాడు భారత ప్రధానిని ఏ విధంగా చంపారో బొమ్మలతో సహా ప్రదర్శించారు నిర్వాహకులు. శకటం మీద శ్రీ దర్బార్ సాహిబ్ హత్యకు ప్రతీకారంగానే ఆమె హత్య జరిగినట్లు ఒక సందేశాన్ని కూడా ఉంచారు పెరేడ్ నిర్వాహకులు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది అవమానించడమే... ఇదే వీడియోని జత చేసి మిలింద్ దేవర ట్విట్టర్లో స్పందిస్తూ... కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యను సంబరంగా చేసుకుంటూ 5 కి.మీ మేర పెరేడ్ నిర్వహించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఒకరి పక్షాన ఉండటం కాదుగాని ఒక దేశ చరిత్రకు ఆ మరణం వలన ఆ దేశానికి కలిగిన బాధను గౌరవించాలి. ఈ చర్యను అందరూ ఖండించాలన్నారు. విదేశాంగ శాఖ మంత్రి నిద్రపోతున్నారా? ఈ ట్వీట్ కు స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని సంబరంగా చేసుకుంటుంటే చోద్యం చూస్తున్నారా? వెంటనే విదేశాంగమంత్రి జైశంకర్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కెనడియన్ హై కమీషనర్ కామెరూన్ మేక్ కే కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆత్మహత్యే శరణ్యం.. కెనడాలో భారత విద్యార్థుల ఆవేదన -
రాజకీయాలకే వన్నెతెచ్చిన అక్కిరాజు వాసుదేవరావు
సాక్షి,కోదాడ అర్బన్ : ఎంతో చైతన్యం కల్గిన హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అక్కిరాజు వాసుదేవారావు నాటి రాజకీయాలకే వన్నె తెచ్చారు. ప్రజలకిచ్చి వాగ్దానాలను నెరవెర్చడంలో ఆయన సఫలీకృతులయ్యారు. 1962 నుం చి1972 మరకు వరకు రెండు సార్లు కాంగ్సెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికై బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహా రావుల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం 1977 కోదాడ నియోజకవర్గం ఏర్పడిన అనంతరం ఆయన 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.1978కు ముందు కాంగ్రెస్ ఉన్న ఆయనను ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి పరిశీలనలో ఉన్నదని, ఆయన సమకాలికులు చెబుతున్నారు. స్వచ్ఛందంగా.. 1983 వరకు కోదాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అదే సంవత్సరంలో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ స్థానిక పరిస్థితలను అవగతం చేసుకుని, పెరిగిన ఎన్నికల వ్యయం, వర్గవిభేదాలు, కులప్రాతిపతికన ఓట్లు చీలడంతో పోటీనుంచి తప్పుకున్నారు. తన శిష్యుడైన చింతాచంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించారు. నేటి రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టికెట్ల కోసం తన్నుకుంటున్న ఈ స్థితిలో ఆయనకు వచ్చిన టికెట్‌ను స్యచ్ఛందంగా వదులుకుని సమకాలిన రాజకీయాలకే వన్నె తెచ్చారు. ఈ నిర్ణయాన్ని కోదాడ ఎన్నికల బహిరంగ సభకు వచ్చిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ స్యయంగా బహిరంగ వేదిక పైనుంచే అభినందించారు. విద్యాప్రదాతగా.. హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల్లో పోటీచేసిన సందర్భములో ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కోదాడలో డిగ్రీ కళాశాలను ఆర్ట్స్అండ్ సైన్స్ విభాగంతో ఏర్పాటు చేయించారు. తొలుత కోదాడ బాలుర ఉన్నతపాఠశాలలో ఈ కళాశాలను ప్రారంభించారు. అనంతరం తన బంధువులైన కొండపల్లి రాఘవమ్మరంగారవు నుంచి 60ఎకరాల భూమిని విరాళంగా సేకరించి 1970లో కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు ఫౌండర్ చైర్మన్‌గా ఆయన కొనసాగారు. అదే విధంగా ఆయన కళాశాల అభివృద్ధికి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేశారు. అప్పట్లోనే విదేశాల్లో ఎంబీఏ చదివిన మాజీమంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణరావును కళాశాల కరస్పాండెంట్‌గా చేశారు. ఈ కళాశాల ద్వారా ఎందరో విద్యార్ధులు ఉన్నత చదువులు చదివి, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ కళాశాలకు, కళాశాల విద్యార్థులకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం బ్రహ్మానందరెడ్డితో.. వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్ నియోజకవర్గ పరిధిలో వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత కూడా ఆయనకు ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు. అప్పటి వరకు కిరోసిన్ దీపాలతో ఉండే గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి, వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. రహదారులు, వైద్యానికి పెద్దపీట నియోజకవర్గంలో రహదారులను ఏర్పాటు చేయడంలో ఆయన కృషిచేశారు. కనీస రహదారి లేని గ్రామాలకు మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు రహదారి సౌకర్యాలు కల్పించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ద్వారా హుజూర్నగర్, కోదాడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అనేక గ్రామాలను కలుపుతూ రోడ్లు వేయించారు. స్వతహాగా ఆర్ఎంపీ వైద్యుడైన ఆయన నియోజకవర్గంలో వైద్యానికి కూడా పెద్దపీట వేశారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషిచేశారు. గఫార్‌ఖాన్ ప్రసంగాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తున్న అక్కిరాజు సాగర్ కాలువల ఏర్పాటులో కూడా ప్రత్యేకతే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయన హుజూర్నగర్, కోదాడ ప్రాంతాలకు సాగర్‌నీటిని తీసుకొచ్చేందుకు చేసిన కృషి ఇప్పటికీ ఆయా ప్రాంతాల ప్ర జలు కొనియాడుతారు. పీవీ నర్సింహారావు మంత్రి వ ర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆ యన అప్పటి కాలువల ఏర్పాటులో ఎంతో కృషిచేశారు. జాతీయ నాయకులతో సత్సంబంధాలు రాజకీయంగా ఆయన రాష్టంలో మంచి గుర్తింపు తెచ్చుకుని జాతీయ నాయకులతో మంచి సత్సంబంధాలను కొనసాగించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోదాడకు వచ్చిన సందర్భముగా ఆయనను అభినందించి సెంట్రల్లో మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. అనంతరం ఆమె హత్యకు గురికావడంతో రాజకీయ ప్రస్థానానికి ఇబ్బంది ఏర్పడింది. పీవి నర్సింహారావుకు బంధువు, అత్యంత ఆత్మీయుడు అయన వాసుదేవరావుకు మారుతున్న రాజకీయ పరిణామాలతో రాజకీయ జీవితానికి విఘాతం కల్గింది. ఆప్కాబ్ చైర్మన్, ఖాధీ భాగ్యనగర సమితి చైర్మన్ ఆయన కొనసాగారు. జాతీయ స్థాయిలో ఆయనకు మణిశంకర్ అయ్యర్ తదితర ఆనాటి నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. రాష్ట్రంలో అప్పటి పెద్దతరం నాయకులు, సినిమా పరంగా ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణరెడ్డి, దాశరథిలతో మంచి సంబంధాలను కొనసాగించారు. ఆంగ్లంలో అనర్గళవక్తగా అక్కిరాజు వాసుదేవరావుది హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేళ్లచెర్వు శివారు వెంకట్రాపపురం. ఆయన కుటుంబం భూస్వామ్య కుటుంబం కావడంతో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆయనను ఆయన తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలో చదివించారు. అక్కడ ఆయన ఎస్ఎస్ఎల్సీ వరకు చదవి అంగ్లంలో మంచి పట్టు సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో అసెంబ్లీలో పలు సమస్యలపై ఆంగ్లలో మాట్లాడుతుంటే సభ ఆసాంతం ఆలకించేదని పాత తరం నాయకులు తెలిపే వారు. ఆంగ్లంలో మంచి పట్టు సాధించడంతో జాతీయ స్థాయిలో కూడా ఆయన మంచి గుర్తింపు వచ్చిం ది. రాష్ట్రానికి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా వారి ప్రసంగాలను ఆయన తర్జుమా చేసే వారని తెలిపారు. -
‘ఆ ఒక్క కారణంతో ఆమెను విమర్శించడం తగదు’
సాక్షి, ముంబై : ఎమర్జెన్సీ విషయంలో ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై మిత్రపక్షం శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. 1975లో విధించిన ఎమర్జెన్సీని సాకుగా చూపించి.. ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవను మర్చిపోవడం తగదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీని బీజేపీ నేతలు మరోసారి చర్చనీయాంశంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీలపై విమర్శిస్తూ తమ పార్టీ పత్రిక ‘ సామ్నా’ లో ఆదివారం వీకెండ్ కాలమ్ ఘాటుగా రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇందిర ఎంతో గౌరవం ఇచ్చారని... ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ఇందిరాకు ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం ఎంటో తెలుస్తుందన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి మహనీయులను తక్కువచేసి చూపించాలనుకోవడం సరైంది కాదని అన్నారు. కేవలం ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఇందిరపై చెడుగా ముద్ర వేయాలనుకోవడం తగదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయని... ఆ నిర్ణయాలు కరెక్టా? తప్పా? అనేది ఎవరైనా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తప్పని పరిస్థితుల్లోనే ఇందిర ఎమర్జెన్సీని విధించి ఉండవచ్చని చెప్పారు. ఇందిర ఎమర్జెన్సీని విధించిన రోజును బ్లాక్ డేగా నిర్వహించాలని అనుకుంటే... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో బ్లాక్ డేలను నిర్వహించాల్సి ఉంటుందని రౌత్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన రోజును కూడా బ్లాక్ డేగా జరుపుకోవాలని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది సామాన్యులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. చిన్న చిన్న వ్యాపారులు నష్టపోయారని తెలిపారు. బ్లాక్ మనీ బయటకు వస్తుందని ప్రధాని చెప్పారు..కానీ నల్ల కుబేరుల మనీ వైట్ మనీగా మరిందని ఎద్దేవా చేశారు. డబ్బుల కోసం క్యూలో నిలబడి ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న ఓ బ్యాంకు... నోట్ల రద్దు సమయంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 575 కోట్లను మార్పిడి చేసిందని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియాకు స్వాతంత్ర్యం లేకుండా చేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు... కానీ నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీకి, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఏమాత్రం తేడా లేదని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అద్వానీని జైల్లో పెట్టారని... ఇప్పుడు కనీసం మాట్లాడలేని స్థితిలోకి ఆయనను నెట్టేశారని విమర్శించారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ, బీజేపీ నేతలులు భయపడుతున్నారని... అందుకే ఇందిరాగాంధీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో 50 సీట్లను కూడా గెలువని అస్థిపంజరం లాంటి కాంగ్రెస్‌కు బీజేపీ భయపడుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మానసిక స్థితికి బాగాలేదని అందకు ఆయన మాటలే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడాలి అంతే కానీ 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని శివసేన పేర్కొంది. -
సిక్కులను చంపించింది.. ఫోటో దిగుతారా?
సాక్షి, సినిమా : ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన ఓ ఫోటో వివాదాస్పదంగా మారింది. తన కటుంబ సభ్యులు ఇందిరతో దిగిన ఓ ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతే కొందరు అసభ్యపదజాలంతో ప్రియాంకను తిడుతూ కామెంట్లు పెట్టారు. అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా మూడు దశాబ్దాల క్రితం ఫోటో అంటూ షేర్ చేయగా.. ఫోటోలో ప్రియాంక తల్లి, పిన్ని, తాత ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా లైకులు, కామెంట్లు చాలా వచ్చాయి. అయితే ఆ కామెంట్లలో చాలా మట్టుకు బండ బూతులు ఉండటం విశేషం. ఇందిరా గాంధీ సిక్కులను ఊచకోత కోయించిందని.. అలాంటి వ్యక్తితో ఫోటో దిగటానికి మీ కుటుంబానికి సిగ్గు లేదా? అని కొందరు.. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మీరూ ఇలా నేతల ఫోటోలు షేర్ చెయ్యకండని కొందరు కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లను ప్రియాంక పట్టించుకోలేదు. ఇక వివాదాలు ప్రియాంకకు కొత్తేం కాదు. గతంలో మోదీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవటం, జాతీయ జెండాను చున్నీలా చుట్టుకోవటం, అస్సాంపై అనుచిత వ్యాఖ్యలు... తదితర వివాదాల్లో ఆమె చిక్కుకున్న విషయం తెలిసిందే. An amazing old photo my masi(aunt) @neelaakhouri sent over with her,my mother @madhumalati ,my late grand parents Madhu Jyotsna and Manhar krishna Akhouri with the late former PM of India Indira Gandhi. #just #Roots #history #family ❤️🙏🏼 A post shared by Priyanka Chopra (@priyankachopra) on Oct 30, 2017 at 6:55pm PDT -
ఇందిర ఎన్ఎస్ఎస్ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో విశిష్ట సేవలు అందించిన కళాశాలలు, ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ప్రోగ్రామ్ అధికారులు, ఉత్తమ వలంటీర్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సత్కరించి ఇందిరా గాంధీ జాతీయ సేవాపథకం అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 53 సంస్థలు, వ్యక్తులకు అవార్డులు అందచేశారు. తెలంగాణకు ఆరు, ఏపీకి 9 అవార్డులు దక్కాయి. అవార్డు గ్రహీతల వివరాలు.. ‘అప్‌కమింగ్’ వర్సిటీ విభాగంలో ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్. రాజు, వైస్ చాన్స్‌లర్(ఆంధ్రా వర్సిటీ), డాక్టర్ ఎన్.ఎ. ధరణి పాల్(ఆంధ్రా వర్సిటీ), ‘అప్రీసియేషన్’ విభాగంలో డాక్టర్ బి.సురేష్‌లాల్(కాకతీయ వర్సిటీ)లకు అవార్డులు లభించాయి. ఉత్తమ యూనిట్/ప్రోగ్రాం అధికారుల విభాగంలో ిసీహెచ్. శ్రీనివాస్-ప్రిన్సిపాల్, రాపోలు గోపీకృష్ణ(వివేకానంద డిగ్రీ- పీజీ కళాశాల, కరీంనగర్), బి.మధుసూదన్‌రెడ్డి-ప్రిన్సిపాల్, కల్వకుంట రామకృష్ణ(ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కరీంనగర్), ఎ.సుధాకర్-ప్రిన్సిపాల్, మద్దినేని సుధాకర్(ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చోడవరం, గుంటూరు), డి.సుధారాణి- ప్రిన్సిపాల్(ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల, శివాజీపాలెం, విశాఖపట్నం), చిళ్ల ఆదినారాయణ(ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల, శివాజీ పాలెం, గుంటూరు)లకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఎన్ఎస్ఎస్ వలంటీర్ విభాగంలో ఎన్.రాహుల్ పాల్(ఆంధ్రా వర్సిటీ), కె.కృష్ణ (శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ), కందూరి రోహిణి(జేబీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కావలి), కె.అవంతి(వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కరీంనగర్) లకు పురస్కారాలు దక్కాయి.