న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల జవాబుపత్రాల తిరిగి మూల్యాంకణానికి అవకాశం ఇచ్చింది. ఇదే క్రమంలో వివిధ కారణాల వల్ల నిర్దేశించిన కాలానికి డిగ్రీ కోర్సులను పూర్తి చేయని విద్యార్థులకు మరో ‘ప్రత్యేక అవకాశం ఇవ్వాలని’ విద్యార్థి సంఘాలు వర్సిటీ అధికారులను కోరుతున్నాయి. అనారోగ్య కారణాలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఇతరత్రా పరిస్థితుల వల్ల కోర్సును పూర్తి చేయని విద్యార్థులకు ఈ అవకాశం గొప్పసహాయకారిగా ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్‌యూ) అధ్యక్షుడు మోహిత్ నాగర్ అభిప్రాయపడ్డారు. పరీక్షల విభాగంపై అధిక ఒత్తిడి పడుతున్నదనే కారణంతో గతంలో ఉన్న ఈ ‘ప్రత్యేక అవకాశాన్ని’ వర్సిటీ రద్దు చేసిందని చెప్పారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు.
హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు
వర్సీటీ రూల్స్ ప్రకారం ప్రవేశం పొందిన తేదీ నుంచి (డిగ్రీని ఆరు సంవత్సరాల్లో, పీజీని నాలుగు సంవత్సరాల్లో )పూర్తి చేయాల్సి ఉంది. ‘ ప్రత్యేక అవకాశం కల్పించడం ద్వారా మధ్యలో చదువులు నిలిపేసిన విద్యార్థులు పెండింగ్ పరీక్షలు రాయడానికి వీలుకలిగింది. కానీ రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని డీయూ రద్దు చేసింది. ఈ విషయమై 32 మంది విద్యార్థులు ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల విజ్ఞప్తిని పరిశీలించి అవకాశం ఇవ్వాలని హైకోర్టు డీయూ అకాడమిక్ కౌన్సిల్‌కు సూచించింది. విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించడం చట్టవ్యతిరేకమని డీయూ నిబంధనల్లో ఎక్కడా లేదని గుర్తు చేసిందని డీయూ మీడియా కోఆర్డినేటర్, విద్యార్థుల సంక్షేమం జాయింట్ డీన్ మాలె నీరవ్ చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి ‘ప్రత్యేక అవకాశాన్ని’ విద్యార్థులకు కల్పించామని డీయూ అధికారి పేర్కొన్నారు. మళ్లీ ఈ అవకాశాన్ని తిరిగి కల్పించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.
ప్రత్యేక అవకాశాన్ని పునరుద్ధరించాలి'
Published Tue, Oct 28 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM
Advertisement
Advertisement