ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీపై కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పులను ఏపీ, తెలంగాణ మధ్య పంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన షీలా భిడే కమిటీ తన సిఫారసులను సమర్పించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను డంపింగ్ చేసేందుకు ప్రాజెక్టు అథారిటీ నుంచి అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు రాలేదని కేంద్ర మంత్రి అనిల్‌మాధవ్ దవే తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
షీలా భిడే కమిటీ నివేదిక సమర్పించింది
Published Wed, Feb 8 2017 3:30 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement