అడవులనే వన దేవతలుగా....... | Sudha G Tilak Temple Tales In India | Sakshi
Sakshi News home page

అడవులనే వన దేవతలుగా.......

Published Mon, Nov 11 2019 6:11 PM | Last Updated on Mon, Nov 11 2019 8:42 PM

Sudha G Tilak Temple Tales In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముక్కోటి దేవతలకు ముందు మన పూర్వికులు ప్రకృతిని దైవంగా ఆరాధించేవారు. సూర్యుడు, గాలి, వర్షం, నీరు, వృక్షాలు, అడవులు, జంతువులను దైవ చిహ్నాలుగా గుర్తంచి ప్రార్థించేవారు. అందుకే భారత్‌లోనైనా, యూరప్‌లోనైనా జానపథ కథలు, గంధర్వ కథలు అడవులతో పెనవేసుకొనే ఉంటాయి. భూమిపైన మానవ జాతి నాగరికథ పరిఢవిల్లడంలో అడవులు అద్భుత పాత్రను పోషించాయి. గ్రీకు నాగరికత విలసిల్లడంలో ఆలీవ్‌ వృక్షం కీలక పాత్ర పోషించిందట. అందుకే ఎవరితోనైనా ‘శాంతి ప్రతిపాదన’కోసం ‘టు ఆఫర్‌ యాన్‌ ఆలివ్‌ బ్రాంచ్‌’ అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. గ్రీక్, రోమన్‌ దేవతలతోపాటు అక్కడి చక్రవర్తులు కిరీటాల్లో పుష్పాలను ధరించేవారు. దేవతలను అలంకరించాలన్నా, విజయోత్సవాల సందర్భంగా చక్రవర్తులను సన్మానించాలన్నా గడ్డితో చేసిన కిరీటాలకు గోరింట, సిందూర, బిర్యానీ ఆకులను అలంకించేవారు. పుష్పాలను, చెట్లను రోమన్లు ఆడ దేవతులుగా ఆరాధించేవారు.  జపాన్‌లోని ‘షింటో’ ఆరాధకులు ‘క్రిప్టోమేరియా’ చెట్లకు ఆలయాలు నిర్మించారు. దక్షిణ చైనాలోని సనీ ప్రజలు అడవులను ‘మిజీ’ దేవతగా ఆరాధిస్తారు. ఆఫ్రికాలోని అనేక అడవులను ఇప్పటికీ పవిత్రమైనవిగా భావిస్తారు. 

భారత దేశంలో కూడా 
భారత దేశంలో కూడా 15000 పవిత్రమైన అడవులు ఉండేవి. వాటిని తపోవన్, మహావన్‌గా, శ్రీవన్‌లుగా మన పూర్వికులు విభజించారు. భారత్‌లోని ఆలయాలకు, అడువులకు కూడా విడిదీయరాని అనుబంధం ఉంది. అడవుల్లో  వెలసిన ఈ ఆలయాల్లో ఒక్కొదాట్లో ఒక్కో జాతికి చెందిన ప్రత్యేక వృక్షం ఉండేది. వాటిని ‘స్థల వృక్షా’ అని పిలిచేవారు. ఆ ఆలయాల్లోని దేవతలందరికి మొక్కలు, వృక్షాలు, పుష్పాలు, పండ్లతో ప్రత్యేక అనుబంధం ఉండేది. వేప చెట్టును శక్తి, చింత చెట్టును దుర్గ, చెరకును (ఇక్షువన) వినాయకుడు, దేవదారు వృక్షాలను శివుడు, తులసి పొదల(బృందావనం)ను కృష్ణుడిని ప్రతీకలుగా భావించి పూజించే వారు. కన్నడలో వన దుర్గ, బెంగాలీలో బోంబీబీ పేరతో అడవులను దేవతలుగా ఆరాధించేవారు. 

బీహార్‌లో అర్రాహ్‌లో ‘అరణ్య దేవి టెంపుల్‌’ ఇప్పటికీ ఉంది. అడవులను వన దేవతలుగా భావించి రక్షించుకోక పోవడం వల్లనే నేడు ‘ఎకాలోజికల్‌ ఎమర్జెన్సీ’ పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని ‘వన దేవతల’ గురించి, వాటి చుట్టూ ఉన్న కథల గురించి ఇంతకన్నా సంపూర్ణంగా తెలుసుకోవడానికి సుధా జీ తిలక్‌ రాసిన ‘టెంపుల్స్‌ టేల్స్‌’ చదవాల్సి ఉంటుంది. 

(వారం క్రితం మార్కెట్‌లోకి వచ్చిన ఈ పుస్తకం ‘అమెజాన్‌’లో 239 రూపాయలకు లభిస్తుంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement