న్యూఢిల్లీ: గత ఏడాది ఉగ్రదాడుల్లో మరణాలకంటే రోడ్లపై గుంతలకారణంగా ఎక్కువ మంది మరణించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రాల్లో గుంతలమయమైన రోడ్లపై మరణాలకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల శాఖ(ఎంఆర్‌వోటీహెచ్) ఇచ్చిన గణాంకాలతో ఆయారాష్ట్రాలు విభేదించడంతో కోర్టు విచారం వ్యక్తంచేసింది. ‘రాష్ట్రాలే స్వయంగా ఎంఆర్‌వోటీహెచ్‌కు ఇచ్చిన గణాంకాలను మళ్లీ అవే రాష్ట్రాలు తప్పు అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ వ్యాఖ్యానించింది.
రాష్ట్రాలు గతంలో ఎంఆర్‌వోటీహెచ్‌కు ఇచ్చిన గణాంకాల ప్రకారం 2017లో ఉగ్రవాదుల దాడుల్లో 803 మంది చనిపోగా, రోడ్లపై గుంతలకారణంగా ఏకంగా 3,597 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ‘రోడ్ల నిర్వహణకు కేటాయిం చిన నిధులు సరిపోవట్లేవని రాష్ట్రాలే అంటున్నాయి. మళ్లీ.. అవే రాష్ట్రాలు రోడ్లను నిర్వహించలేము అని ఎలా చెప్తాయి? నిర్వహణకు నిధులు లేనపుడు కాంట్రాక్టర్లకు మాత్రం ఎందుకు డబ్బులిస్తున్నాయి? రోడ్లను అలాగే వదిలేస్తారా? అసలు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? రోడ్ల నిర్వహణ బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత పౌరులదే అంటారా ఏంటి? అని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment