ప్రతితాత్మక చిత్రం
రోడ్డు పమాదాల్లో.. ఇతర చోట్ల క్షతగాత్రులకు, బాధితులకు సాయం చేసేవారు ఇకపై కేసులకు భయాపడాల్సి అవసరం లేదు. ఎందుకంటే సాయం చేసిన వారిని.. వారి సమ్మతి లేకుండా కనీసం సాక్ష్యానికి కూడా పిలవకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.
తిరుపతి క్రైం: ఒకటి కాదు.. రెండు కాదు.. నగరంలో రోజూ ఏదో ఒకచోట రోడ్డుప్రమాదాలు జరగడం సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో క్షతగా త్రులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నాయి. బాధితుల అత్యవసర పరిస్థితి చూసి ఎవరైనా స్పందించి ఆస్పత్రిలో చేర్చినా, వారిని పోలీసులు విచారణ పేరుతో వేధింపులు ఎక్కువగా ఉండేవి. వివరాలు సేకరించేందుకు గంటల తరబడి నిలిపేసేవారు. ఇది చాలదన్నట్లు కేసులంటూ కోర్టుల చుట్టూ తిప్పేవారు. ఫలితంగా ఈ నిబంధనల జంజాటం మనకెందుకులే అనుకుంటూ జనం సాయానికి వెనుకడుగు వేసేవారు. ఆ సమయంలో రక్షించడానికి అవకాశం ఉన్నా కూడా ఎవరూ బాధ్యత తీసుకునేందుకు సిద్ధపడేవారు కాదు. ఈ పరిస్థితి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గెజిట్ నోటిఫికేషన్ ఏం చెప్పింది?
రోడ్డుప్రమాదంలో బాధితులకు తక్షణ సాయం అందించేందుకు, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించేవారికి ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం సరికొత్త నిబంధనలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛందసేవా సంస్థ సేవ్‌లైవ్ ఫౌండేషన్ ప్రమాద బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రమాద బాధితులకు, సాయం చేసే వారికి అనుకూలంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిప్రకారం ప్రమాద బాధితులకు సాయం చేసేవారు తమ వివరాలను చెప్పకపోయినా.. వారు తీసుకొచ్చిన క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చుకోవా ల్సిందే. వారు తమ వివరాలను వెల్లడించి స్వచ్ఛందంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతామంటేనే పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి రక్షకులు వెళ్లిపోవచ్చు. ఇంకా గెజిట్‌లో ఏఏ నిబంధనలు ఉన్నాయంటే.
పేరు చెప్పాల్సిన అవసరం లేదు..
రోడ్డు ప్రమాద బాధితులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకుని రావచ్చు. అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వెంటనే వెళ్లిపోవచ్చు. ఆస్పత్రి సిబ్బంది రక్షించిన వ్యక్తిని వివరాలేమీ అడగరు. ఉండమని చెప్పరు. రోడ్డుప్రమాదంలో ఇరుకున్నవారికి, సాయంచేసిన వారి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఇతరులకు వెల్లడించకూడదు. ఒకవేళ డిమాండ్ చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు.
క్షతగాత్రులకు సత్వరమే వైద్యం
ప్రమాద బాధితులకు డాక్టర్లు తక్షణమే చికిత్స అం దించాలి. ఏ వైద్యుడైనా, ఏకారణం లేకుండా చికిత్స చేసేందుకు నిరాకరిస్తే అతనిపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఈ నిబంధనలు ంటనే అమలు చేయాలని కేంద్రం పేర్కొంది.
ఒక్కసారే కోర్టుకు...
ఎవరైనా రోడ్డుప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి అయితే కేసు దర్యాప్తులో భాగంగా తన వివరాలను పోలీసులకు స్వచ్ఛందంగా అందజేయవచ్చు. ఇలాంటి కేసుల విచా రణలో భాగంగా సాక్ష్యం చెప్పేందుకు ఒక్కసారి కోర్టు కు హాజరుకావాల్సి ఉంది. అయితే అతన్ని విచారణ పేరిట వేధింపులకు గురి చేయకూడదు. ఎప్పుడు రావాలో సదరు సాక్షికి ముందస్తుగా తెలియజేయాలి. తరువాత అతన్ని ఎప్పుడూ పిలువ కూడదు.
Comments
Please login to add a commentAdd a comment