న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు ఉరి శిక్ష విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని బుధవారం సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. రాజీవ్ హంతకులకు ఉరిశిక్షను ఖరారు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారి ఉరిశిక్షను, యావజ్జీవ శిక్షగా మారుస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించుకుంది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులు క్షమాభిక్షకు అర్హులు కారని ఇటీవల కేంద్రం స్పష్టం చేసింది. 1991 మేలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. రాజీవ్ ను హత్య చెయ్యడానికి విదేశీయుల సహాయం తీసుకున్నారని, అలాంటి వారిని క్షమించొద్దని సుప్రీంకు విజ్క్షప్తి చేసింది. వారిని విడిచి పెట్టడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో అర్జీ సమర్పించింది.
అయితే రాజీవ్ గాంధీని హత్య చేసిన వారికి ఉరి శిక్ష విధించకుండా యావజ్జీవ శిక్ష ను విధించడాన్ని ప్రశ్నిస్తూ, శిక్ష అనుభవిస్తున్న వారిని ముందుగానే విడుదల చెయ్యాలని సమర్పించిన అర్జీలను కూడా బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత... ఉరి కాదు యావజ్జీవం
Published Wed, Jul 29 2015 4:11 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement