న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్‌గా మార్చాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తన అభ్యర్థనను మొదటగా కేంద్రం ముందుంచాలని చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ ఏకే సిక్రిలు పిటిషనర్ నిరంజన్ భత్వాల్‌కు సూచించారు. పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు కేంద్ర స్పందనను బట్టి మళ్లీ తమను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.
'ఈ పిటిషన్ పై సంబంధిత అధికారులను సంప్రదించండి. మీరెందుకు ఇండియా పేరును భారత్ గా మార్చాలనుకుంటున్నారో వారికి చెప్పండి' అని సుప్రీంకోర్టు తెలిపింది. దానిపై వారి స్పందన ఎలా ఉన్న తిరిగి కోర్టును ఆశ్రయించ్చని తెలిపిది.