ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ రద్దు | supreme court directs CBSE to re-conduct all india pre-medical Test 2015 within four weeks | Sakshi
Sakshi News home page

ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ రద్దు

Published Mon, Jun 15 2015 11:55 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ రద్దు - Sakshi

ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ రద్దు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆల్ ఇండియా ప్రి మెడికల్ టెస్టు ప్రశ్నా పత్రాలు లీకైన నేపథ్యంలో అది చెల్లదని స్పష్టం చేసింది. నాలుగువారాల్లోగా కొత్తగా పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కూడా సీబీఎస్ఈని ఆదేశించింది. పరీక్ష కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రశ్నా పత్రాల లీకేజీ సమస్య ఏర్పడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది.

అంతకుముందు మరోసారి పరీక్షకు ఏర్పాట్లు చేస్తే జాప్యం అవుతుందని, విద్యార్థులు నష్టపోతారని సీబీఎస్ఈ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. ప్రశ్నాపత్రాలు లీక్ అవలేదని సీబీఎస్ఈ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మొత్తం 6.3 లక్షల మందికి ఇప్పటికే ఓసారి పరీక్ష నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు లీకవడంతో కొందరు కోర్టుకు వెళ్లగా జూన్ 5న వెలువరించాల్సిన ఫలితాలు ఆగిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement