ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాంలో అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్‌లకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన సమీనా బేగం, బీజేపీ నేత, సామాజిక కార్యకర్త అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ, మరో నలుగురు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. మరోవైపు ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించాలని సుప్రీంలో గట్టిగా వాదించిన కేంద్రం ఈ అంశాలపై ఎలాంటి కౌంటర్‌తో ముందుకు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment