విభజనపై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ ను ఇప్పుడు విచారించలేమని తేల్చిచెప్పింది. విభజన ప్రక్రియ ప్రస్తుతం ఉన్న దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, ఎస్‌ఏ బోడెప్పలతో కూడిన బెంచ్ తీర్పు చెప్పింది. పిటిషనర్ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర విభజనపై అసెంబ్లీ నిర్ణయం వెలువరించాక సంబంధిత న్యాయ సంస్థను ఆశ్రయించ వచ్చని సూచించింది. గత నాలుగు నెలల క్రితం కూడా కృష్ణయ్య తెలంగాణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.