మన్మోహన్కు సుప్రీంలో తాత్కాలిక ఊరట
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్కు... సీబీఐ జారీ చేసిన సమస్లపై న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ గోపాల గౌడ, నాగప్ప బెంచ్ ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లో సమాధానం ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.
కాగా బొగ్గు స్కాం కేసులో నిందితుడిగా విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మన్మోహన్తో పాటు కుమారమంగళం బిర్లా, పీసీ పరేఖ్, డి.భట్టాచార్య, హిందాల్కో సంస్థకు ఊరట లభించింది.
కాగా ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కోకు కేటాయించడంపై దాఖలైన కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా కోర్టు పేర్కొంటూ ఏప్రిల్ 8న నిందితుడిగా విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు ఇచ్చింది. తనకు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని మన్మోహన్ పిటిషన్ తన పిటిషన్లో పేర్కొన్నారు.