సర్జికల్‌ దాడులపై ఓ సినిమా, రెండు పుస్తకాలు | Surgical strike, one year later: Books and film on anvil | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ దాడులపై ఓ సినిమా, రెండు పుస్తకాలు

Published Fri, Sep 29 2017 4:07 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

Surgical strike, one year later: Books and film on anvil - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్‌ దాడులు నిర్వహించి సెప్టెంబర్‌ 28 నాటికి ఏడాది పూర్తయిన వేళ ఈ ఘటనను ఆధారంగా తీసుకుని ఓ చిత్రంతో పాటు రెండు పుస్తకాలు రానున్నాయి. ‘ఉడీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అధియా ధార్‌ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో భారత బృందానికి నేతృత్వం వహించిన కమాండర్‌గా విక్కీ కౌశల్‌ నటిస్తున్నారు. దీంతోపాటు జర్నలిస్ట్, రచయిత నితిన్‌ గోఖలే రాసిన ‘ఇన్‌ సెక్యూరింగ్‌ ఇండియా ది మోదీ వే: పఠాన్‌ కోట్, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అండ్‌ మోర్‌’ పుస్తకాన్ని శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. సర్జికల్‌ దాడులతోపాటు భారత సైనికుల ప్రదర్శించిన అసమాన సాహసాలతో శివ్‌ అరూర్, రాహుల్‌ సింగ్‌లు రచించిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌: ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడ్రన్‌ మిలటరీ హీరోస్‌’ పుస్తకం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement