చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్‌కు ఇప్పటిదాకా ఎలాంటి మందు లేదు. ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు అవసరమైన ఔషదం తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. అయితే.. ఈ వైరస్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేశారు. విందు అనగానే మనకు సాధారణంగా అనేక రకాల వంటకాలు గుర్తుకొచ్చినా ఇక్కడ మాత్రం పింగాణీ కప్పుల్లో గోమూత్రం, పేడను అందించడం విశేషం. గోమూత్రంతో కరోనా వైరస్‌ను రాకుండా చేయవచ్చంటూ గత కొద్ది రోజులుగా స్వామి చక్రపాణి గత కొద్ది రోజులుగా తన వాదనను వినిపిస్తున్నారు. దీనిని బలపరిచే ఉద్దేశ్యంతో ఢిల్లీలో ఒక విందు ఏర్పాటుచేయగా.. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం.
అయితే గతంలో ఈ కరోనా వైరస్‌ను గో మూత్రం, ఆవు పేడతో కేన్సర్‌ను నివారించవచ్చని అసోం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ, భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ అసోం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ వాదిస్తున్నారు. గో మూత్రం, ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్యతో గుజరాత్‌లోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో కేన్సర్ పేషెంట్లకు అందిస్తున్నారు. గతంలో కరోనా వైరస్ నివారణకూ ఈ చికిత్స పని చేస్తుందని వారు మాట్లాడిన సంగతి తెలిసిందే.
కాగా భారత్‌లో ఇప్పటివరకు 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు పైగా బాధితులు మరణించగా.. 1,45, 810 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ భయాల నేపథ్యంలో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి... షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల ఆఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: కరోనా ఎఫెక్ట్: పద్మ పురస్కారాలు వాయిదా
Achche din 👇🏼 https://t.co/iUZLEwsOW4
— Anurag Kashyap (@anuragkashyap72) March 14, 2020
Comments
Please login to add a commentAdd a comment