29కు చేరిన స్వైన్‌ఫ్లూ మృతులు | Swine flu death toll mounts to 29 in Odisha | Sakshi
Sakshi News home page

29కు చేరిన స్వైన్‌ఫ్లూ మృతులు

Published Tue, Aug 29 2017 8:20 PM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM

స్వైన్‌ఫ్లూతో ఒడిశాలో ఇప్పటి వరకు 29మంది చనిపోయారు.

భువనేశ్వర్‌(ఒడిశా): ఒడిశాను స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ఈ వ్యాధి సోకి ఇప్పటి వరకు 29మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇప్పటి వరకు సేకరించిన 881 స్వాబ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా 297మందికి పాజిటివ్‌ అని తేలింది.

దీంతోపాటు రాష్ట్రంలో డెంగీతో ముగ్గురు చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. స్వైన్‌ఫ్లూ బాధితులకు చికిత్స విధానాలు, జాగ్రత్తలపై ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement