చెన్నై: లాక్‌డౌన్ 5.0 సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపటి నుంచి ప్రజా రవాణా రోడ్డెక్కనుంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగల్పట్ జిల్లాల్లో మాత్రం బస్సులు తిరిగేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. మరోవైపు మాల్స్, ప్రార్థనా మందిరాలు మూసే ఉంటాయని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న షోరూమ్స్, టెక్స్‌టైల్స్, నగల దుకాణాలు 50 శాతం సిబ్బందితో తిరిగి తెరుచుకోవచ్చని సూచించింది. (కోవిడ్ @ ఇండియా)
కాగా జూన్ 1 నుంచి రాష్ట్రం లోపల, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీటి కోసం ప్రత్యేక పాస్‌లు అనుమతి పొందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దీనిపై ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించింది. దేశవ్యాప్తంగా 1,73,763 కరోనా కేసులు నమోదవగా 82,370 మంది మంది కోలుకున్నారు. తమిళనాడులో 20,246 మంది కరోనా బాధితులుండగా 11,313మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. (కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30దాకా లాక్‌డౌన్)
Comments
Please login to add a commentAdd a comment