లైంగిక, సైబర్ నేరగాళ్లపై గూండా యాక్ట్ కేసు!
చెన్నై: సైబర్ నేరాలు, లైంగిక హింసలను అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేసేలాగా 1982 తమిళనాడు యాక్ట్ 14ను సవరిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది.
నిత్యం నేరాలకు పాల్పడే వారిపై ప్రస్తుతం గూండా యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందితే మహిళలపై లైంగిక హింస, సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఇదే సెక్షన్ కింద అరెస్ట్ చేయనున్నారు. తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్ విశ్వనాథన్ సోమవారం రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.