Goondas Act
-
ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా ప్రచారం
గుంటూరు ఈస్ట్: టీడీపీ గూండాల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ శావల్యాపురం మండల కన్వినర్ భీమని అంకారావును వైఎస్సార్సీపీ నేతలు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళుతుంటే తనపై దాడి చేసి రెండు గంటల పాటు తన కారును అడ్డగించారని, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో అంకారావు అడ్డుగా రావడంతో టీడీపీ నేతల చేతుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు వేసుకున్న రాళ్లే వాళ్లకు తగిలాయన్నారు. టీడీపీ నేత పుల్లారావు, ఆయన భార్య చేసిన దోపిడీ గురించి అందరికీ తెలుసన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తనకు అక్రమ ఆస్తులున్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. జీవీ ఆంజనేయులు ఎన్ఎస్పీ కాలువ పైన రైతుల వద్ద నుంచి కొన్న భూమిలో గెస్ట్‌హౌస్ నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జీవీ ఆంజనేయులు వినుకొండలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ విలేకరులపై టీడీపీ గూండాల దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళిత సామాజికవర్గానికి చెందిన సాక్షి విలేకరులు ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర కవరేజికి వెళ్లిన ఓ విలేకరిపై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి, హింసించారు. పాదయాత్రంలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిత్రీకరించారన్న నెపంతో మరో మరో విలేకరిపై దాడికి పాల్పడ్డారు. లోకేశ్ పాదయాత్రపై వాస్తవాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కసుతో లోకేశ్ ప్రైవేటు సైన్యం ఈ దాడులకు పాల్పడింది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ వద్ద సెల్ఫీ కార్యక్రమం జరిగింది. కొందరు టీడీపీ కార్యకర్తలను సెల్ఫీకి అనుమతించకపోవడంతో అక్కడ గొడవ జరిగింది. ఈ సమయంలో పాదయాత్ర కవరేజికి వెళ్లిన సాక్షి విలేకరి, దళిత సామాజిక వర్గానికి చెందన కరుణాకర్ ఆ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన లోకేశ్ ప్రైవేటు సెక్యూరిటీ కరుణాకర్‌ను టెంట్‌లోకి లాక్కొని వెళ్లి డెయిరీ, సెల్‌ఫోన్, లాక్కొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ పిడుగుద్దులు గుద్దారు. ‘సాక్షి’ విలేకరులకు బాగా బలిసింది.. మీ సంగతి తేలుస్తామని దూషిస్తూ గంటసేపు టెంట్లో నిర్బంధించారు. సెల్‌ఫోన్ మొత్తం పరిశీలించి ఫొటోలు డిలీట్ చేశారు. మరోసారి పాదయాత్రలో ఫొటోలు తీసినా, వ్యతిరేక వార్తలు రాసినా సహించేది లేదని, పాదయాత్రలో కనిపిస్తే చంపుతామంటూ లొకేశ్ పర్సనల్ సిబ్బంది బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ సంగతి తేలుస్తామని బెదిరించి పంపేశారు. వెల్లంపల్లి దగ్గర జరిగిన లోకేశ్ పాదయాత్రలో సాక్షి విలేకరి మరొకరిపైనా టీడీపీ మూక దాడికి పాల్పడంది. పాదయాత్రలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దళిత యువకులపై లోకేశ్ ప్రైవేటు సైన్యం దాడి చేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నాగులుప్పలపాడు మండల ‘సాక్షి’ విలేకరి, దళిత సామాజికవర్గానికి చెందిన అత్తంటి మధుబాబుపై కూడా టీడీపీ మూక దాడికి పాల్పడింది. పది మంది చుట్టుముట్టి చేతిలో నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. మరోమారు ఇటువంటివి పునరావృతమైతే ప్రాణాలు ఉండవంటూ తీవ్రస్థాయిలో బెదిరించి పంపేశారు. విలేకరి మధును వదిలేసినా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన దళిత యువకులను శుక్రవారం రాత్రికి కూడా వారి నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దాడి హేయమైన చర్య: దళిత సంఘాలు ఏ తప్పూ చేయని దళిత విలేకరులపై లోకేశ్ గుండాలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. లోకేశ్ సిబ్బందిని అదుపులో పెట్టుకోకపోతే పాదయాత్ర సాగకుండా అడ్డుకుంటామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. దళిత విలేకరులు కరుణాకర్, మధుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘సాక్షి’ రిపోర్టర్లపై దాడి దారుణం ‘సాక్షి’ విలేకరులు కరుణాకర్, మధుబాబుపై టీడీపీ గుండాల దాడి హేయమైన చర్య. ఒంగోలులో లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన లేదు. సాక్షి పత్రిక ఈ నిజాలను నిర్భయంగా రాస్తోంది. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సెల్ఫోన్లు లాక్కోవడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ సాక్షి దళిత విలేకరి కరుణాకర్, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -
13 ఏళ్ల బాలుడిపై గుండాయాక్ట్
కాన్పూర్ : పదమూడేళ్ల కుర్రాడిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హింసను ప్రేరేపిస్తున్నాడంటూ, చాలా కేసుల్లో ప్రమేయం ఉందంటూ పదమూడేళ్ల బాలుడిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. కన్పూర్ పట్టణ సమీపంలోని నవాబ్ జంగ్ పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టు అయిన వారికి బెయిల్ అంత ఈజీగా బెయిల్ దొరకకు పోగా, ఆరునెలల వరకు జిల్లా నుంచి కూడా సదరు వ్యక్తులను బహిష్కరించే అధికారం పోలీసులకు ఉంటుంది. కౌలాలి గ్రామానికి చెందిన యోగేంద్రపాల్ తన కొడుకును అక్రమ కేసులో ఇరికించి గూండా యాక్ట్ ప్రయోగించారని స్థానిక కోర్టును ఆశ్రయించి సెప్టెంబర్ 11న బెయిల్ పొందాడు. తన కొడుకిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదుచేయడం వల్ల సరిగా పాఠశాలకు పోవడం లేదని, నవాబ్‌జంగ్ పోలీసులు నమోదుచేసిన ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన పట్టణ ఎస్పీ రాజేష్ కృష్ణన్ కోరారు. తొమ్మిదో తరగతి చదివే ఈ బాలుడు ట్రెరర్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని, చాలా కేసుల్లో ఈ బాలుడికి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాలుడి వయసుకు సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లను సిటీ ఎస్పీకి తండ్రి యోగేంద్ర సమర్పించాడు. ఇది చాలా సీరియస్ విషయం, బాలుడిపై తప్పుడు కేసు బనాయించినట్లు తేలితే సంబంధిత స్టేషన్ పోలీసులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేష్ హెచ్చరించారు. పిల్లాడిపై విధించిన కేసుకు సంబంధించి పూర్తి నివేదికను కోరానని ఆయన తెలిపారు. మూడు రోజుల్లో నవాంబ్జంగ్ పోలీసులు ఈ నివేదికను అందించాలని ఆదేశించారు. -
లైంగిక దాడి చేస్తే ఇక గూండా యాక్ట్!
చెన్నై: తమిళనాడులో ఎవరైనా లైంగిక దాడికి పాల్పడితే ఇక నుంచి వారిపై గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. లైంగిక దాడులు, సైబర్ నేరాలకు పాల్పడేవారిని గూండాల నియత్రణ చట్టం కిందికి తెచ్చేందుకు ఉద్దేశించిన రెండు సవరణ బిల్లును తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ఏడాది జనవరిలో ఢిల్లీలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మహిళలకు రక్షణ కల్పించేందుకు 13 అంశాల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గూండా యాక్ట్‌ను సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. లైంగిక నేరాలకు పాల్పడితే నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో కూడిన రౌడీషీట్‌ను తెరిచేలా చట్టంలో మార్పులు తెస్తున్నారు. -
లైంగిక, సైబర్ నేరగాళ్లపై గూండా యాక్ట్ కేసు!
చెన్నై: సైబర్ నేరాలు, లైంగిక హింసలను అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేసేలాగా 1982 తమిళనాడు యాక్ట్ 14ను సవరిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. నిత్యం నేరాలకు పాల్పడే వారిపై ప్రస్తుతం గూండా యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందితే మహిళలపై లైంగిక హింస, సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఇదే సెక్షన్ కింద అరెస్ట్ చేయనున్నారు. తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్ విశ్వనాథన్ సోమవారం రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.