లైంగిక దాడి చేస్తే ఇక గూండా యాక్ట్! | Sexual offenders to be brought under Goondas Act | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి చేస్తే ఇక గూండా యాక్ట్!

Published Mon, Aug 11 2014 7:39 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

జయలలిత - Sakshi

జయలలిత

చెన్నై: తమిళనాడులో ఎవరైనా లైంగిక దాడికి పాల్పడితే ఇక నుంచి  వారిపై గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.  లైంగిక దాడులు, సైబర్ నేరాలకు పాల్పడేవారిని గూండాల నియత్రణ చట్టం కిందికి తెచ్చేందుకు ఉద్దేశించిన రెండు సవరణ బిల్లును తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర  అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

గత ఏడాది జనవరిలో ఢిల్లీలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మహిళలకు రక్షణ కల్పించేందుకు  13 అంశాల యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గూండా యాక్ట్ను సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టారు.  లైంగిక నేరాలకు పాల్పడితే నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో కూడిన రౌడీషీట్‌ను తెరిచేలా చట్టంలో మార్పులు తెస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement