Tamilanadu Govt.
-
అనుమతి లేకుండా బోరుబావి తవ్వితే ఏడేళ్ల జైలు
చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బోరుబావులు తవ్వితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా అసెంబ్లీలో సోమవారం ముసాయిదా ప్రవేశపెట్టారు. సాగునీటి కోసం విచ్చలవిడిగా బోరుబావులు తవ్వడం ఎక్కవైపోయింది. చిన్నారులు వాటిల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం తరచూ జరుగుతోంది. ఈ ప్రమాదాలను నివారించేలా చట్టంలో మార్పులను తీసుకువస్తున్నారు. అనుమతి తీసుకోకుండా బోరును తవ్విన యజమానికి 3 నుంచి 7 ఏడేళ్ల వరకు కారాగార శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించేలా ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. -
లైంగిక దాడి చేస్తే ఇక గూండా యాక్ట్!
చెన్నై: తమిళనాడులో ఎవరైనా లైంగిక దాడికి పాల్పడితే ఇక నుంచి వారిపై గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. లైంగిక దాడులు, సైబర్ నేరాలకు పాల్పడేవారిని గూండాల నియత్రణ చట్టం కిందికి తెచ్చేందుకు ఉద్దేశించిన రెండు సవరణ బిల్లును తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ఏడాది జనవరిలో ఢిల్లీలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మహిళలకు రక్షణ కల్పించేందుకు 13 అంశాల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గూండా యాక్ట్‌ను సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. లైంగిక నేరాలకు పాల్పడితే నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో కూడిన రౌడీషీట్‌ను తెరిచేలా చట్టంలో మార్పులు తెస్తున్నారు.