
చెన్నై: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..! పేదరికంలో మగ్గిపోతున్న నెల్లై వాసికి రూ.5 కోట్ల విలువైన లాటరీ బహుమతిగా లభించింది. కేరళ ప్రభుత్వం నిర్వహించే లాటరీలో తిరునల్వేలికి చెందిన వ్యక్తికి రూ.5 కోట్ల బహుమతి లభించింది. ఈ వివరాలు శనివారం వెల్లడయ్యాయి. తమిళనాడులోని నెల్‌లై జిల్లా కోట్టైకరుంగుళ్లం ప్రాంతానికి చెందిన చెల్లయ్య(50) భార్య సుమతి, ఇద్దరు పిల్లలతో కలిసి తిరువనంతపురం సమీపంలోని మూవాట్రుపుళాలో ఉంటున్నాడు.
పేదరికంలో ఉన్న అతను హోల్‌సేల్ వ్యాపారుల వద్ద లాటరీ టికెట్లు కొనుక్కుని వాటిని ప్రజలకు విక్రయించేవాడు. ఇటీవల కేరళ ప్రభుత్వం విడుదల చేసిన కారుణ్య భాగ్యశ్రీ బంపర్ లాటరీ టికెట్లను విక్రయించాడు. ఆ లాటరీ డ్రా ముందురోజు నాలుగు టికెట్లు విక్రయం కాకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. లాటరీ డ్రాలో అతని వద్ద ఉన్న టికెట్‌కు రూ.5 కోట్ల బహుమతి లభించింది. దీన్ని హోల్‌సేల్ వ్యాపారి వద్దకు వెళ్లి ధ్రువపరచుకున్నాడు. దీంతో అతని సంతోషానికి అవధుల్లేవు.
Comments
Please login to add a commentAdd a comment