
వెంకయ్యతో సుజనా, సీఎం రమేష్ భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ బుధవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలపై వెంకయ్య నాయుడుతో చర్చించినట్లు తెలిపారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతోందని, సాయంత్రానికి ఓ స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. చట్టపరంగా ఉన్న అంశాలపై చర్చ జరుగుతోందన్నారు. వెంకయ్యతో భేటీ అనంతరం సుజనా చౌదరి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు.
కాగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, రాష్ట్ర విభజన నాడు ఇచ్చిన వాగ్దానాల సంకలనంగా కేంద్రం రూపొందించిన ఆర్థిక ప్యాకేజీపై నేడు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కలిసి సంబంధిత ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.