మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలుగు భాష ఎదిగిందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కొనియాడారు.ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు సమూహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు మాట్లాడేవారంతా ఒకే సెల్‌ఫోన్ అని, డ్యూయల్ సిమ్ కార్డులు ఏపీ, తెలంగాణ అని పేర్కొన్నారు. తెలుగు భాషకు వెలకట్టలేమన్నారు. భవిష్యత్తులో తెలుగువారు ప్రపంచంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాలను గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్.. వివిధ రంగాలకు ప్రముఖులకు అందజేశారు.
ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలుగు భాష
Published Mon, Apr 11 2016 1:21 AM | Last Updated on Mon, Oct 8 2018 6:26 PM
Advertisement
Advertisement