దాడులకు ప్లాన్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్ | Terror module arrested in Haridwar in joint operation by Delhi Police Special Cell and IB | Sakshi
Sakshi News home page

దాడులకు ప్లాన్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

Published Wed, Jan 20 2016 3:26 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

దాడులకు ప్లాన్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్ - Sakshi

దాడులకు ప్లాన్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

హరిద్వార్: ఉత్తరాఖండ్లో ఉగ్రవాదుల కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం నలుగురు అనుమానితులను హరిద్వార్ లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్, ఐబీ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో వీరిని పట్టుకున్నారు. వీరికి ఐసిస్తో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. హరిద్వారాలో జరుగుతున్న అర్ధ్ కుంభ మేళాలో దాడులకు కుట్రపన్నుతున్నట్టు సమాచారం. పఠాన్ కోట్ దాడులకు పాల్పడిన వారితో ఈ నలుగురికి సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఢిల్లీలోని షాపింగ్ మాల్స్లలో కూడా దాడులు చేయడం కోసం వీరు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. పోలీసులు వీరిని ఢిల్లీలోని కోర్టు ముందు హాజరు పరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement