ఢిల్లీలో దాడికి ఉగ్రవాదుల కుట్ర? | terrorists may attack on delhi, IB warns | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దాడికి ఉగ్రవాదుల కుట్ర?

Published Sun, Jan 3 2016 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

ఢిల్లీలో దాడికి ఉగ్రవాదుల కుట్ర?

ఢిల్లీలో దాడికి ఉగ్రవాదుల కుట్ర?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్ బ్యూరో మరోసారి హెచ్చరించింది. 15 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ఇద్దరు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు భద్రత బలగాలకు సమాచారం అందించింది. ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రముఖులు నివసించే ప్రాంతంలో మరింత భద్రతను పెంచారు. ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశముందని వారం క్రితం కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి.

పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. తనిఖీల అనంతరం రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement