'2007 నుంచి వైద్యపర్యవేక్షణలో బాల్ ఠాక్రే' | Thackeray was on medication since 2007: Doctor tells HC | Sakshi
Sakshi News home page

'2007 నుంచి వైద్యపర్యవేక్షణలో బాల్ ఠాక్రే'

Published Fri, Feb 20 2015 11:45 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

'2007 నుంచి వైద్యపర్యవేక్షణలో బాల్ ఠాక్రే' - Sakshi

'2007 నుంచి వైద్యపర్యవేక్షణలో బాల్ ఠాక్రే'

ముంబై: 2007 నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే  గుండె, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడేవారని ఆయనకు వైద్యసేవలందించిన డాక్టర్ జలీల్ పార్కర్ ముంబై హైకోర్టుకు తెలిపారు.  మరణానికి ముందు  బాల్ ఠాక్రే రాసిన విల్లు విషయంలో ఆయన కుమారులు ఉద్ధవ్ ఠాక్రే, జయదేవ్ లకు మనస్పర్ధలు రావడంతో ఆస్తి గొడవ కోర్టుకెక్కింది. కోర్టు సమక్షంలోనే విల్లు గురించి డాక్టర్ పార్కర్ ను కోర్టు ప్రశ్నించింది. పార్కర్ 2012 లో బాల్ఠాక్రే మరణించే వరకు ఆయనకు వైద్యసేవలందించారు. ఠాక్రే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతుండే వారని డాక్టర్ తెలిపారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్  సీమాసెర్నాయిక్ అడిగిన ప్రశ్నలకు పార్కర్ సమాధానమిస్తూ...బాల్ ఠాక్రే 2007 నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని తెలిపారు. ఈ స్టెరాయిడ్లను దీర్ఘకాలం ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని  డాక్టర్ చెప్పారు. వాటితో పాటు తలనొప్పి, వర్టిగో, నోరు తడారి పోవటం వంటి మరికొన్ని సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశం ఉందని పార్కర్ కోర్టుకు తెలిపారు. శరీరంలోని అవయవాల పనితీరును తెలుసుకునేందుకు రోజువారీ పరోక్షలు నిర్వహించేవాన్నని ఆయన తెలిపారు. ఐదేళ్లపాటు మెడిసిన్ కొనసాగించాలని ఠాక్రేకి తెలుసా అని కోర్టు అడిగిన ప్రశ్నకు... ఆయన రోజువారీ ఉపయోగించే మందులు, ఆహార అలవాట్లపై ఠాక్రేకి తెలుసని సమాధానమిచ్చారు. ఆయన రోజూ తెల్లవారు జామున 3.30-4 గంటల మధ్య నిద్రలేచేవారని, అంతేకాకుండా ఇంటిపై భాగంలో రోజూ వాకింగ్ చేసేవారని డాక్టర్ పార్కర్ కోర్టుకు తెలిపారు. అనంతరం పార్కర్ విచారణను కోర్టు మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement