‘125 కోట్ల ప్రజల విజయం’ | Thank you, for supporting demonetisation | Sakshi
Sakshi News home page

‘125 కోట్ల ప్రజల విజయం’

Published Wed, Nov 8 2017 9:21 AM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

Thank you, for supporting demonetisation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు 125 కోట్ల భారతీయుల విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.  పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో స్పందించారు. డిమానిటైజేషన్‌ ప్రక్రియకు 125 కోట్ల భారతీయులు స్వచ్ఛందంగా మద్దతిచ్చారని ఆయన కొనియాడారు. అవినీతి, నల్లధనంపై జరిపిన పోరాటంలో ప్రజలే విజేతలుగా నిలిచారని ఆయన అన్నారు.

డిమానిటైజేషన్‌కు సంబంధించిన ఒక గ్రాఫిక్‌ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన మోదీ.. దానికి పెద్ద నోట్ల రద్దు.. చారిత్రాత్మక బహుళ పరిణామాల విజయంగా అయన పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రజలు తనకు పూర్తిగా సహకరించారని.. వారికి అభినందనలు తెలిపారు.

సరిగ్గా ఏడాది కిందట ప్రధాని నరేంద్రమోదీ ఎవరూ ఊహించని విధంగా అప్పడు చలామణిలో ఉన్న రూ.500, రూ. 1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement