
‘లోక్ మంగళ’ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
షోలాపూర్, న్యూస్‌లైన్ : పట్టణంలోని లోక్‌మంగళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సామూహిక వివాహాలు జరిగాయి. హరిబాయి దేవకరణ్ పాఠశాల ప్రాంగణంలో 111 జంటలు ఒకటయ్యాయి.
అనంతరం రెండు గంటలపాటు 111 రిక్షాల్లో జంటలతో బారాత్ నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు లక్ష మందికి పైగా వధూవరుల బంధువులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 210 మంది రక్తదానం కూడా చేశారు. అంతేకాకుండా ఇక్కడ ‘స్వచ్ఛ్ భారత్’ నిర్వహించి చెత్తచెదారాన్ని నిర్ణీత ప్రదేశంలో వేసేలా అవగాహన కల్పించారు.
ఇదిలా ఉండగా, లోక్‌మంగళ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిపించడం ఇది 18వ సారి అని ఫౌండేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సుభాష్ దేశ్‌ముఖ్ తె లిపారు.