క్రెడిట్ అంతా సుప్రీం కోర్టుకే దక్కుతుంది: జెఠ్మలానీ
క్రెడిట్ అంతా సుప్రీం కోర్టుకే దక్కుతుంది: జెఠ్మలానీ
Published Wed, Oct 29 2014 1:31 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో ఇదోక శుభపరిణామం అని విదేశీ బ్యాంకుల్లోని నల్లధనం వెలికితీత అంశంపై ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలనీ స్పందించారు. అయితే ఈ క్రెడిట్ ఆర్ధిక శాఖా లేదా అటార్నిజనరల్ కు దక్కకుండా కేవలం సుప్రీం కోర్టుకే వెళుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నల్ల కుబేరుల జాబితాలోని పేర్లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు అప్పగించాలని ఆయన అన్నారు. ఈ కేసులో విచారణను ప్రభుత్వం, లేదా అధికారుల చేతుల్లో పెట్టకుండా చర్యలు తీసుకోవాలని రాం జెఠ్మలనీ సూచించారు. నల్ల కుబేరుల జాబితాను బుధవారం ఉదయం సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం అందించింది.
Advertisement
Advertisement