
స్వయం పాలనే లక్ష్యం
- మేనిఫెస్టోలో పీడీపీ హామీ
శ్రీనగర్: స్వయం పాలన సంకల్పంగా పీపుల్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ) ఎన్నికల మేనిఫెస్టోను సీనియర్ నేతలు ముఫ్తీ మొహమ్మద్‌సయీద్ శుక్రవారం విడుదల చేశారు. అవినీతికి తావులేని సుపరిపాలన అందిస్తామని అందులో పేర్కొన్నారు.
అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గాడినపెడతామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల సాధికారతకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రాష్ట్రానికి అందించిన ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఆ అధికరణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల నుంచి వ్యక్తిగత బాధ్యతల వరకు.. ఆర్థిక వ్యవస్థ నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుందని అందులో పేర్కొన్నారు. నియంత్రణ రేఖకు అవతలి వైపుతో సత్సంబంధాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి అనుసంధానత, ప్రాంతీయ స్వేచ్ఛావాణిజ్య ప్రాంతం ఏర్పాటు తమ లక్ష్యాలని తెలిపారు.