బాలనేరస్తులను జైళ్లకు పంపరు | The new law to Child criminals | Sakshi
Sakshi News home page

బాలనేరస్తులను జైళ్లకు పంపరు

Published Thu, May 26 2016 1:19 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

The new law to Child criminals

న్యూఢిల్లీ: చట్టాన్ని అతిక్రమించే 16-18 ఏళ్ల వయసున్న బాలనేరస్థులకు బేడీలు వేయకుండా, లాకప్‌లో పెట్టకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా ‘జువెనైల్ జస్టిస్ చట్టం-2015’ను రూపొందించినట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆమె ఈ చట్టం ముసాయిదాను విడుదల చేశారు. బాలనేరస్తులతో పోలీసులు, జువెనైల్ జస్టిస్ బోర్డులు(జేజేబీ) వ్యవహరించాల్సిన తీరు, ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులకు సంబంధించిన వివరాలు చెప్పాలి.. ముసాయిదా ప్రకారం కేసు నమోదైన 30 రోజుల్లోపు నేరస్తుని వయసును జేజేబీ నిర్ధారించాలి. ప్రతి రాష్ట్రం వీరి పునరావాసాకి  కనీసం ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి.  

 పౌష్టికాహార సమీక్షకు సాఫ్ట్‌వేర్:  అంగన్‌వాడీల్లో అందిస్తున్న పౌష్టికాహార సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించే సాఫ్ట్‌వేర్‌ను మేనక ప్రారంభించారు. దీన్ని బిల్‌గేట్స్ ఫౌండేషన్ రూపొందించింది. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ట్యాబ్‌ల్లోని యాప్ ద్వారా వివరాలను అప్‌డేట్ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement