Minister Maneka Gandhi
-
కనికరం లేని మాజీ సైనికుడు.. వీడియో వైరల్
సాక్షి, బర్నాలా: ఓ మాజీ సైనికుడు తుపాకితో తన పెంపుడు కుక్కను కట్టేసి కాల్చి చంపాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలా జిల్లా బాద్బార్ గ్రామంలో చోటుచేసుకుంది. అజిత్ సింగ్ మాజీ సైనికుడు. బాద్బార్ తన సొంత గ్రామం. అజిత్ సింగ్ తన మిత్రుడు సత్వీర్ సింగ్‌తో కలిసి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే కుక్కను కాల్చి దారుణంగా హతమార్చాడు. ఆ సైనికుడి కుమారుడు ఆ సన్నివేశాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీనిపై స్పందించిన జంతు హక్కుల సంస్థ.. వారిపై చర్యలను తీసుకోవాలని కేంద్రమంత్రి మనేకా గాంధీ, పంజాబ్ డీజీపీలకు లేఖ రాశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బైల్‌పై బయటకు వచ్చిన మాజీ సైనికుడు అజిత్ సింగ్ మాట్లాడుతూ.. నా పెంపుడు కుక్కకు ర్యాబీస్ వ్యాధి సోకింది.. ఈ కుక్క తన రెండు గేదెలను, చాలా మంది ప్రజలను కరిచింది అందుకే చంపానని ఆయన పోలీసులకు తెలిపారు. చాలా ప్రేమతో ఆ కుక్కను నేను పెంచుకున్నాను. అలాంటిది నేనే ఎందుకు చంపుకుంటానని మాజీ సైనికుడు చెప్పారు. కుక్క అవయావాలను టెస్టు నిమిత్తం డాక్టర్ ల్యాబ్‌కు పంపారు. -
కనికరం లేని మాజీ సైనికుడు..
-
బాలనేరస్తులను జైళ్లకు పంపరు
న్యూఢిల్లీ: చట్టాన్ని అతిక్రమించే 16-18 ఏళ్ల వయసున్న బాలనేరస్థులకు బేడీలు వేయకుండా, లాకప్‌లో పెట్టకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా ‘జువెనైల్ జస్టిస్ చట్టం-2015’ను రూపొందించినట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆమె ఈ చట్టం ముసాయిదాను విడుదల చేశారు. బాలనేరస్తులతో పోలీసులు, జువెనైల్ జస్టిస్ బోర్డులు(జేజేబీ) వ్యవహరించాల్సిన తీరు, ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులకు సంబంధించిన వివరాలు చెప్పాలి.. ముసాయిదా ప్రకారం కేసు నమోదైన 30 రోజుల్లోపు నేరస్తుని వయసును జేజేబీ నిర్ధారించాలి. ప్రతి రాష్ట్రం వీరి పునరావాసాకి కనీసం ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి. పౌష్టికాహార సమీక్షకు సాఫ్ట్వేర్: అంగన్వాడీల్లో అందిస్తున్న పౌష్టికాహార సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించే సాఫ్ట్‌వేర్‌ను మేనక ప్రారంభించారు. దీన్ని బిల్‌గేట్స్ ఫౌండేషన్ రూపొందించింది. అంగన్వాడీ సూపర్వైజర్లు ట్యాబ్‌ల్లోని యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేస్తారు. -
‘ఆపద బటన్’కు ఓకే
న్యూఢిల్లీ: అత్యవసర సమయాల్లో మహిళలను ఆదుకునేందుకు ఫోన్లలో ‘ఆపద బటన్’ సౌకర్యాన్ని కల్పించేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు అంగీకరించాయి. ఎమర్జెన్సీ అలర్ట్‌లను పంపగలిగే సౌకర్యముండే ఫోన్లు వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి రానున్నాయి. బటన్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే టెలికమ్యూనికేషన్స్ శాఖ జారీచేయనుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం ప్రకటించారు. ఫోన్లలో కొత్త ఫీచర్ ద్వారా మహిళలకు అదనపు రక్షణ కల్పించగలమని ఆమె అన్నారు. ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్న ఫోన్లలోనూ ఈ బటన్ ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీలతో భేటీ సందర్భంగా వారిని కోరినట్లు ఆమె తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘నేషనల్ ఉమెన్ హెల్ప్‌లైన్’ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. పోలీసు, లీగల్, మెడికల్, కౌన్సెలింగ్ ఇలా అన్నిరకాలుగా మహిళలకు ఒకేచోట సాయం అందేందుకు ఈ నంబర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. -
‘అన్ని రకాల హింస మగాళ్ల వల్లే...’
న్యూఢిల్లీ: సమాజంలో జరుగుతున్న అన్ని రకాల హింసకు మగాళ్లే కారణమని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందువల్ల లింగ వివక్షను రూపుమాపడానికి పురుషుల పాత్ర పెరగాలని సూచించారు. ఆమె సోమవారం ఫేస్బుక్ యూజర్లతో లైవ్‌చాట్ చేశారు. లింగ వివక్షను రూపుమాపాలంటే పాఠశాల స్థాయి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. దీని కోసం స్కూళ్లలో ‘జెండర్ చాంపియన్స్’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని, స్కూళ్లలో బాలికల పట్ల గౌరవం చూపుతూ, వారికి సహాయంగా ఉండే బాలురకు ప్రత్యేకంగా బహుమతులిస్తామని, అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలికలకూ బహుమతి అందిస్తామని తెలిపారు. విజయాలు సాధించిన 100 మంది మహిళలను గుర్తించేందుకు చేపట్టిన ‘100 ఉమెన్ ఇనిషియేటివ్’ కార్యక్రమం కోసం ఆమె ఈ చాట్ నిర్వహించారు. దేశంలోని మురికివాడల్లో ఉన్న పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే ప్రతి 7 నిమిషాలకు ఒక కొత్త పాఠశాల అవసరమన్నారు. -
వాటి కార్యక్రమాలకు హాజరవడం దండగ
న్యూఢిల్లీ: అసోచాం, ఫిక్కీ, సీఐఐ తదితర సంస్థలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవని, అవి నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లడమంటే సమయం వృథా చేసుకోవడమేనని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. బుధవారమిక్కడ అసోచామ్ ‘పని ప్రదేశంలో మహిళలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశిస్తూ.. ‘జాతి నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి ఈ చాంబర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాణిజ్య సంస్థల కార్యక్రమాలకు హాజరవడమంటే సమయాన్ని పూర్తిగా వృథా చేసుకోవడమే. ఎందుకంటే దేశం కోసం ఏదైనా చేయాలని వారిని కోరినప్పుడు.. వారు మాటలు చెప్పడమే తప్ప చేసేది తక్కువ..’ అని విమర్శించారు.