కనికరం లేని మాజీ సైనికుడు.. | ex army man kills pet dog in punjab, video viral | Sakshi
Sakshi News home page

కనికరం లేని మాజీ సైనికుడు..

Published Sat, Dec 9 2017 2:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఓ మాజీ సైనికుడు తుపాకితో తన పెంపుడు కుక్కను కట్టేసి కాల్చి చంపాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలా జిల్లా బాద్బార్‌ గ్రామంలో చోటుచేసుకుంది. అజిత్‌ సింగ్‌ మాజీ సైనికుడు. బాద్బార్‌ తన సొంత గ్రామం. అజిత్‌ సింగ్‌ తన మిత్రుడు సత్వీర్‌ సింగ్‌తో కలిసి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే కుక్కను కాల్చి దారుణంగా హతమార్చాడు. ఆ సైనికుడి కుమారుడు ఆ సన్నివేశాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీనిపై స్పందించిన జంతు హక్కుల సంస్థ.. వారిపై చర్యలను తీసుకోవాలని కేంద్రమంత్రి మనేకా గాంధీ, పంజాబ్‌ డీజీపీలకు లేఖ రాశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement