వాటి కార్యక్రమాలకు హాజరవడం దండగ
న్యూఢిల్లీ: అసోచాం, ఫిక్కీ, సీఐఐ తదితర సంస్థలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవని, అవి నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లడమంటే సమయం వృథా చేసుకోవడమేనని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. బుధవారమిక్కడ అసోచామ్ ‘పని ప్రదేశంలో మహిళలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశిస్తూ.. ‘జాతి నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి ఈ చాంబర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇలాంటి వాణిజ్య సంస్థల కార్యక్రమాలకు హాజరవడమంటే సమయాన్ని పూర్తిగా వృథా చేసుకోవడమే. ఎందుకంటే దేశం కోసం ఏదైనా చేయాలని వారిని కోరినప్పుడు.. వారు మాటలు చెప్పడమే తప్ప చేసేది తక్కువ..’ అని విమర్శించారు.