Government welfare programs
-
‘ఆంధ్రజ్యోతి’కి కలెక్టర్ల అల్టిమేటం
బాధాతప్త.. బరువైన హృదయాలతో స్పందిస్తున్నాం. కలెక్టర్ల వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చాలన్న లక్ష్యంతోనే మీరు ఈ కథనాన్ని ప్రచురించారు. తుపాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అగ్ని, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనలు జరిగిన సమయాల్లో దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి, ప్రజలకు ఉపశమనం కలిగించడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. – కలెక్టర్లు సాక్షి, అమరావతి: తమ నైతిక, ఆత్మస్థెర్యాన్ని దెబ్బతీసే విధంగా ‘హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి ద్వారా ఆ పత్రిక యాజమాన్యానికి లీగల్ నోటీసు పంపారు. కలెక్టర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా కథనం ప్రచురించినందుకు బేషరతుగా క్షమాణలు చెబుతూ.. దానిని ప్రచురించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. వారం లోపు స్పందించకుంటే, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ నోటీసులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► స్వాతంత్య్రం సిద్ధించిన రోజుల నుంచి కలెక్టర్లను ఓ వ్యవస్థగా ఎంతో గౌరవ ప్రదంగా చూస్తున్నారు. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై అభాండాలు మోపుతూ బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడమే కాకుండా, ప్రజలతో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తూ పాలనను ముందుకు తీసుకెళుతున్నాం. ► సమతా వాదం.. లౌకిక వాదం.. మానవతా వాదం వంటి ఉత్కృష్ట సిద్ధాంతాలను నిలబెడుతున్నాం. నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తూ, ప్రజల మద్దతును ఆస్వాదిస్తూ సంపాదించుకున్న కలెక్టర్ల వ్యవస్థ ప్రతిష్టను ఒక కలం పోటుతో దిగజార్చేశారు. ► ఇలాంటి ప్రయత్నాలు జర్నలిజం నైతిక పతనాన్ని నిరూపిస్తున్నాయి. మీ రాజకీయ బాసులను సంతృప్తి పరిచేందుకు అబద్ధపు రాతలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నందుకు మీపై మేం జాలి చూపిస్తున్నాం. మీరు నైతిక విలువలను పూర్తిగా గాలి కొదిలేసి, అబద్ధాల చుట్టూ తిరుగుతున్నారు. రాజకీయ లబ్ధి కోసమే.. ► మీ కథనం పాత్రికేయ విలువలను ఉల్లంఘించేదిగా ఉంది. అంతేకాక దురుద్దేశంతో కూడుకున్నది కూడా. కొందరు అనైతిక విలువలు లేని వ్యక్తుల దుష్ప్రవర్తనను సాకుగా తీసుకుని, మొత్తం ఐఏఎస్ వ్యవస్థపైనే విషం చిమ్ముతూ మీరు కథనం రాశారు. ► కేవలం రాజకీయ లబ్ధి కోసమే మీరు ఇలా చేశారు. మీ బురదజల్లుడు, తప్పుడు నిందారోపణల వల్ల ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తున్న దేశంలోని కలెక్టర్లందరి నైతిక స్థెరాన్ని దెబ్బతీశారు. వాస్తవాలను తెలుసుకోకుండా, తటస్థంగా ఉండాలన్న జర్నలిజం విలువలకుపాతరవేస్తూ కథనం ప్రచురించారు. ► ఇలాంటి రాతలు రాసిన మీ మీడియా హౌస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మౌనాన్ని పిరికితనంగా భావిస్తారని, సందర్భం వచ్చినప్పుడు వాస్తవాలు తెలియచేసి, తదనుగుణంగా స్పందించాలని మహాత్మా గాంధీ చెప్పారు. అందుకే రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాసిన ఈ దురుద్దేశ పూర్వక కథనాన్ని ఖండిస్తున్నాం. మీరు రాసిన కథనం వల్ల మా కుటుంబాలు చెప్పలేనంత తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. మీరు కథనం రాసిన విధానం కలెక్టర్ల వ్యవస్థ పనికిరాదన్న తప్పుడు భావన సామాన్యుడికి కలిగించేలా ఉంది. మీ కథనంలో కూర్చినదంతా తీవ్ర అభ్యంతరకరం.. గర్హనీయం. -
వాలంటీర్ పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనావిష్కరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. కేవలం 16 రోజుల్లోనే దాదాపు 9 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వాలంటీర్ పోస్టుల భర్తీకి ఇంటర్మీడియెట్ విద్యార్హతగా నిర్ణయించినప్పటికీ.. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్ కోర్సులు చదివినవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. జూన్ 24వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. జులై 6వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ ద్వారా 9 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. అందులో ఇప్పటికే 8,20,476 దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, సక్రమంగా ఉన్న 7,81,899 దరఖాస్తులను ఆమోదించారు. 79,580 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న 38,577 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ అభ్యర్ధులు కూడా గడువులోపు తమ దరఖాస్తులు పొరపాట్లను సరిచేసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటి వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం 24 లక్షల మందికి పైగా నెటిజన్లు వెబ్ సైట్ ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నిర్ణయించిన గడువు జూలై 5వ తేదీతో ముగిసింది. ఈ కొలువుల కోసం మొత్తం 7,92,193 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 7,49,878 మంది, గిరిజన ప్రాంతాల నుంచి 42,515 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యావంతుల నుంచి వేలల్లో దరఖాస్తులు గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల కోసం ఉన్నత విద్యావంతులు సైతం పోటీ పడుతున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఈ కొలువు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15,183 మంది, పట్టణ ప్రాంతాల్లో 6,532 మంది, గిరిజన ప్రాంతాల్లో 272 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. పట్టభద్రుల నుంచి కూడా భారీగానే దరఖాస్తులు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2,08,410 మంది, గిరిజన ప్రాంతాల్లో 7,160 మంది పట్టభద్రులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు. మహిళల నుంచి అనూహ్య స్పందన గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం మహిళా అభ్యర్ధుల నుంచి లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కొలువుల కోసం మొత్తం 4,02,245 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్నవారు 3, 25,852 మంది, పట్టణ ప్రాంతాల నుంచి 58,503 మంది, గిరిజన ప్రాంతాల నుంచి 17,890 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్హతల్లో సడలింపు గ్రామ వార్డు వాలంటీర్ల నియామకాలకు సంబంధించి అర్హతల విషయంలో ప్రభుత్వం తాజాగా సడలింపులు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల కోసం గతంలో విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియెట్‌కు తగ్గించారు. గడువు పొడిగింపు వార్డు వాలంటీర్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం తుది గడువును పొడిగించింది. ఈ నెల 5వ తేదీ దరఖాస్తులకు చివరి గడువుగా ముందు నిర్ణయించింది. అయితే వార్డు వాలంటీర్లకు విద్యార్హత డిగ్రీ నుంచి ఇంటర్మీడియెట్‌కు సడలించిన నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం తుది గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించింది. పొరపాట్లు దిద్దుకోండిలా అసంపూర్తి దరఖాస్తుల వల్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు తిరిగి తమ దరఖాస్తులను సరిగ్గా నింపి మరలా అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
ఆ పోస్టులకు 7,82,045 దరఖాస్తులు
సాక్షి, అమరావతి : గ్రామ వలంటీర్ల నియామకానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 13,055 గ్రామ పంచాయతీలలో మొత్తం 1,81,885 గ్రామ వలంటీర్ పోస్టులకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 7,82,045 దరఖాస్తులు అందినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్పారు. ఆఖరి రోజు ఒక్కరోజే 96,271 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు నమోదుకు అవకాశం ఉండటంతో ఆ సంఖ్య నామమాత్రంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పోస్టులకు జూన్ 24నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నియామక ప్రక్రియ కోసం మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ రోజు వారీగా తమ మండల పరిధిలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి.. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల మేరకు ఉన్న వాటిని ఇంటర్వ్యూకు అర్హమైనవిగా తేల్చారు. 7,82,045 దరఖాస్తులలో 6,42,812 దరఖాస్తులను పరిశీలన చేసి, 6,12,750 అర్హమైనవిగా తేల్చారు. కేవలం 30,062 దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా 1,39,233 దరఖాస్తులను అధికారులు పరిశీలన చేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లోని వార్డు వలంటీర్ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచినప్పటికీ, గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియను ముందుగా నిర్ణయించిన మేరకే పూర్తి చేయాలని నిర్ణయించారు. ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలన అనంతరం తిరస్కరణకు గురైన వాటిని మినహాయించి మిగిలిన దరఖాస్తుదారులందరికీ ఈ నెల 11నుంచి 25వ తేదీ వరకు మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. -
4రోజుల్లో 2 లక్షలమంది దరఖాస్తులు
సాక్షి, అమరావతి: గ్రామ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల్లోనే 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌కు వీక్షకులు పోటెత్తారు. సుమారు తొమ్మిది లక్షలమందికి పైగా గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను వీక్షించారు. కాగా దరఖాస్తుల అధికంగా వస్తుండటంతో అధికారులు ముందుగానే పరిశీల ప్రారంభించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత పదో తేదీ నుంచి మండల స్థాయి కమిటీలు పరిశీలన చేసి...11నుంచి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. దరఖాస్తులు ఎక్కువగా అందుతుండటంతో పదో తేదీ ఒక్కరోజు మొత్తం దరఖాస్తులను మండల కమిటీ పరిశీలన చేయడం సాధ్యం కాదని, దరఖాస్తు అందిన వెంటనే పరిశీలన చేసి నమోదు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా గురువారం సాయంత్రం నాలుగు గంటల వరకూ 2 లక్షల దరఖాస్తులు అందాయి. చదవండి: గ్రామ-వార్డు వలంటీర్ల దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్ గ్రామ వాలంటీరు పోస్ట్‌లకు నోటిఫికేషన్ -
గ్రామ-వార్డు వలంటీర్ల దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం http://gramavolunteer. ap.gov.in పేరుతో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. గ్రామ వలంటీర్ల నియామకాల విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వలంటీర్ల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా 2 తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసి.. ఈ నెల 24వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏస్థాయిలోనూ అవినీతికి తావులేకుండా చేసే ఉద్దేశంతో పాటు కులమత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా అర్హులందరికీ పథకాలు చేరవేయడం కోసమే ప్రభుత్వం గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నట్టు వలంటీర్ల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో నంబరు 104లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా గ్రామ వలంటీర్లను ఏ జిల్లాలో ఎంత మందిని నియమించాలన్నది ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అన్ని కేటగిరీలలో సగం మంది మహిళలకే అవకాశం కల్పిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. స్థానికతే ప్రధాన అర్హత... గ్రామ స్థానికతే వలంటీర్లుగా నియామకానికి ప్రాథమిక అర్హతగా ఉత్తర్వులో స్పష్టం చేశారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారు దరఖాస్తుకు కనీసం పదో తరగతి, మిగిలిన గ్రామాల్లో వారికి ఇంటర్ కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. 18-35 ఏళ్ల మధ్య వయసు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు జూలై 11 నుంచి 25 తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వేతనాలకు ఏటా రూ.1,200 కోట్లు మంజూరు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. గ్రామ వలంటీర్లుగా నియమితులయ్యే వారికి నెలకు రూ. 5 వేల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఏటా రూ.1,200 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి తెలుపుతున్నట్టు సీఎస్ ఉత్తర్వులో తెలిపారు. ఆగస్టు ఒకటి నాటికి రాష్ట్రంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును ఎంపికచేసి వారికి మండలాల వారీగా ఆగస్టు 5వ తేదీ నుంచి 10 వరకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం 15వ తేదీ నుంచి వారందరూ కేటాయించిన విధుల్లో చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్యవేక్షణకు రెండు కమిటీలు ఏర్పాటు రాష్ట్ర స్థాయిలో వలంటీర్ల నియామక ప్రక్రియ పర్యవేక్షణకుగాను అధికారులతో రెండు కమిటీలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నియమించారు. జిల్లాలో వలంటీర్ల ప్రక్రియ పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ సుధాకరరావు, కమిషనర్ ఓఎస్డీ దుర్గాప్రసాద్, స్టేట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఏవో సాంబశివరావులతో కమిటీని నియమించారు. వలంటీర్ల నియామకంలో అధికారులకు తలెత్తే సందేహాలను ఈ కమిటీ నివృత్తి చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడితే జిల్లా అధికారులు వాటిని తెలియజేసిన వెంటనే పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖలో ఐటీ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్టీజీఎస్లో పనిచేసే ముగ్గురు నిపుణులతో కలిపి మరో కమిటీని నియమించారు. అర్బన్ వలంటీర్ల నియామకానికి శ్రీకారం నవరత్నాల పథకాలను పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు చేరవేయడానికి వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వార్డు వలంటీర్‌ను నియమించనున్నారు. నియామక ప్రవేశ పరీక్షల కోసం రూ.63.50 లక్షలను, శిక్షణ కార్యక్రమాలకు రూ.6.88 కోట్లను మంజూరు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కోరింది. వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనంగా రూ.5 వేల చొప్పున చెల్లించేందుకు ఏడాదికి రూ.486 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. వార్డు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి డిగ్రీ పాసై, స్థానికుడై ఉండాలి. వీరి ఎంపిక కోసం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మెప్మా సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో http:// wardvolunteer.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ వలంటీర్లకు సంబంధించిన షరుతులే వీరికీ వర్తిస్తాయి. -
సెప్టెంబర్ 15 నాటికి బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీలో గతంలో తలెత్తిన అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది చీరల తయారీని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది. 6.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగాల్సి ఉండటంతో.. ఫిబ్రవరిలోనే చేనేత సహకార సంఘాలకు చీరల తయారీకి చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆర్డర్ ఇచ్చింది. గతంతో పోలిస్తే రంగులు, డిజైన్ల ఎంపికలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగుల్లో 50 రకాలైన చీరలను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 2017 నుంచి అర్హులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేస్తోంది. రెండేళ్లుగా సుమారు 90లక్షల మందికి పైగా ఉచితంగా చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 95లక్షల చీరల పంపిణీని లక్ష్యంగా నిర్దేశించింది. చీరల తయారీ బాధ్యతను సిరిసిల్లలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి తొలి ఏడాది.. అనగా 2017లో ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో.. సిరిసిల్ల చేనేత సహకార సంఘాలు సకాలంలో చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేక పోయాయి. దీంతో 3.75కోట్ల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్ల మరమగ్గాల మీద సిద్ధం చేయగా, మరో 2.36కోట్ల మీటర్ల వస్త్రాన్ని గుజరాత్‌లోని సూరత్ నుంచి దిగుమతి చేసుకున్నారు. సూరత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రం నాణ్యతపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2018 బతుకమ్మ చీరల తయారీకి సంబంధించిన ఆర్డర్‌ను పూర్తిగా సిరిసిల్ల నేత కార్మికులే స్థానికంగా మరమగ్గాలపై సిద్ధం చేశారు. సుమారు 6 కోట్ల మీటర్ల వస్త్రాన్ని సకాలంలో సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత గత ఏడాది డిసెంబర్ మూడో వారంలో ఈ చీరల పంపిణీ ప్రారంభించి..ఈ ఏడాది జనవరి వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగించారు. టెస్కో ద్వారా రూ.450 కోట్ల ఆర్డర్లు తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ (టెస్కో) ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఈ ఏడాది సుమారు రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కాయి. ఈ ఏడాది రూ.280 కోట్లు బతుకమ్మ చీరల రూపంలో సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ లభించింది. వీటితో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంపిణీ చేసే వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్ కూడా ఈ సంఘాలకే దక్కింది. కేసీఆర్ కిట్ల ద్వారా బాలింతలకు ఇచ్చే చీరలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సంబంధించి దుప్పట్లు, కార్పెట్ల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఇదిలా ఉంటే బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి పొందుతున్న సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. గత ఏడాది బతుకమ్మ చీరలు, రంజాన్ వస్త్రాల తయారీకి సంబంధించి టెస్కో నుంచి రూ.25 కోట్ల మేర ఈ సంఘాలకు విడుదల కావాల్సి ఉంది. 95 లక్షల మందికి పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీకి రెండేళ్లుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో లబ్ధిదారులకు చీరలు అందేలా చేనేత శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముదురు రంగులతో కూడిన 50 రకాలైన డిజైన్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు రూపొందించారు. చీర అంచులు, కొంగు డిజైన్లలో వైవిధ్యం ఉండేలా రూపొందించడంతో పాటు, చీరతో పాటు రవిక బట్టను కూడా అందిస్తారు. ఈ ఏడాది సుమారు 6.30 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాలని సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ ఇవ్వగా.. 95లక్షల మందికి చీరలు పంపిణీ చేయనున్నారు. వీటి తయారీ ద్వారా సిరిసిల్లలో 22వేలకు పైగా మరమగ్గాలపై ఆధారపడిన 20వేల మంది చేనేత కార్మికులకు సుమారు ఆరు నెలల పాటు ఉపాధి దక్కనుంది. గతంలో సగటున నెలకు రూ.6 వేల నుంచి రూ.8వేల వరకు వేతనం పొందిన కార్మికులు.. ప్రస్తుత ఆర్డర్లతో సుమారు రూ.20వేల వరకు ఆర్జిస్తున్నారు. -
గులాబీ దళపతి క్షేత్ర పర్యటన!
- దసరా తర్వాత జిల్లాలకు - పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి - సిద్దిపేట నుంచే తొలి పర్యటన సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పాలనపై మాత్రమే దృష్టి పెట్టిన గులాబీ దళపతి, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు తాను జిల్లాల్లో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ, వివిధ కారణాలతో పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి తప్పనిసరిగా సీఎం జిల్లాల పర్యటన ఉండేలా పార్టీ నాయకత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దసరా తర్వాత నుంచి ఆయన జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల నేతలకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. కాగా, సిద్దిపేట నుంచే సీఎం పర్యటనలు మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. రైతులతో నేరుగా: తాజా వర్షాలతో చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు నిండి రైతులంతా సంతోషంగా ఉండడంతో వారిని నేరుగా కలవాలని సీఎం భావిస్తున్నారని పేర్కొం టున్నారు. కొత్త జిల్లాలు కూడా దసరా నుంచే ఉనికిలోకి వస్తున్న నేపథ్యంలో ఒకటి రెండు చోట్ల మినహా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఇప్పటికే అనుకూలత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఈ రెండు అంశాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లా స్థాయిలోనూ అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలోని సమస్యల గురించి తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించడం వంటి వాటికి జిల్లాల పర్యటనలను ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది. పార్టీ సమావేశాలు కూడా జరుపుతారని అంటున్నారు. మొత్తంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తమ పాలనపై ప్రజల నాడిని మరోసారి తెలుసుకోవడం, ప్రజావసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్లో మరింత బాధ్యతను పెంచడం వంటి బహుళ ప్రయోజనాల కోసం సీఎం పర్యటనలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. పదవుల పంపకంపై దృష్టి జిల్లాల పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతోపాటు రెండేళ్లకు పైగా పెండింగులో ఉన్న పదవుల పంపకంపైనా దృష్టి పెడతారని చెబుతున్నారు. జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులు తప్ప వేటినీ భర్తీ చేయలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అటు అధికారిక పదవులు, ఇటు పార్టీ పదవుల పంపకంపై స్పష్టత ఇస్తారని సమాచారం. కొత్త జిల్లాల నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారిక పదవుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ వంటి వాటి విషయంలో చైర్మన్ల పదవులు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ జరపనున్న జిల్లాల పర్యటనలో ఈ పదవుల నియామకానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. -
వాటి కార్యక్రమాలకు హాజరవడం దండగ
న్యూఢిల్లీ: అసోచాం, ఫిక్కీ, సీఐఐ తదితర సంస్థలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవని, అవి నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లడమంటే సమయం వృథా చేసుకోవడమేనని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. బుధవారమిక్కడ అసోచామ్ ‘పని ప్రదేశంలో మహిళలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశిస్తూ.. ‘జాతి నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి ఈ చాంబర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాణిజ్య సంస్థల కార్యక్రమాలకు హాజరవడమంటే సమయాన్ని పూర్తిగా వృథా చేసుకోవడమే. ఎందుకంటే దేశం కోసం ఏదైనా చేయాలని వారిని కోరినప్పుడు.. వారు మాటలు చెప్పడమే తప్ప చేసేది తక్కువ..’ అని విమర్శించారు.