మదురై: ఆ కుర్రాడికి ఇంజినీర్ కావాలని కల. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అనే తీరుగా పుట్టుకతోనే మదురైకి చెందిన చంద్రప్రకాశ్ అనే 14 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. దీంతో అతడికి స్కూల్ వాతావరణం కన్నా ఆస్పత్రితోనే పరిచయం ఎక్కువైంది. స్కూల్లో కంటే ఆస్పత్రి పేషెంట్ రూమ్లోనే ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లుగా అతడి పరిస్థితి మరింత దిగజారింది. అయితే వైద్యులు ఆ బాలుడు బతుకుతాడని హామీ ఇచ్చారు.
బోన్ మ్యారో సహాయం చేసే వాళ్లు ఉంటే అతడిని దక్కించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మెడికల్ సపోర్ట్ తో కాలం వెల్లదీస్తున్న ఆ కుర్రాడికి బోన్ మ్యారో సహాయం దానం చేసేందుకు ఒక వ్యక్తి వచ్చాడు కానీ.. అంతమొత్తానికి అయ్యే ఖర్చు భారాన్ని తల్లిదండ్రులు భరించలేని పరిస్థితి. దీంతో ఎవరైనా పెద్ద మనసుతో సహాయం చేస్తే తమ బిడ్డ బతుకుతాడని మొరపెట్టుకుంటున్నారు. తమిళనాడులోని థెని జిల్లాకు చెందిన ఈ బాలుడి తండ్రి ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. తల్లి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పటికే ఆ బాలుడిని బతికించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆస్తినంతా అమ్మేసుకున్నారు.
ఈ బాలుడికి ఎవరు ప్రాణం పోస్తారు?
Published Mon, Jun 6 2016 9:12 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement