రూ. 3,426 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. ఈ ఎన్నికలకోసం ప్రభుత్వం రూ.3,426 కోట్లు వెచ్చించింది. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ వ్యయం 131 శాతం అధికం. ఐదేళ్ల క్రితం జరిగిన ఆ లోక్‌సభ ఎన్నికలకోసం ప్రభుత్వం చేసిన వ్యయం రూ.1,483 కోట్లు మాత్రమే. ప్రస్తుతం తొమ్మిది దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అటు ప్రభుత్వం చేసిన వ్యయంతోపాటు ఇటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పెట్టిన ఖర్చు రూ.30 వేల కోట్ల పైమాటే.
ఈసారి ఎన్నికల వ్యయం పెరగడానికి పలు అంశాలు కారణమయ్యాయి. ఓటింగ్ శాతం పెరగడానికి వీలుగా ఎన్నికల సంఘం.. ఓటర్లను చైతన్యం చేసేందుకు చేపట్టిన ప్రచారం, ఓటర్ స్లిప్‌ల పంపిణీ చేపట్టడం తదితర చర్యలు ప్రభుత్వపరంగా ఎన్నికల వ్యయం పెరగడానికి దారితీసిన అంశాల్లో కొన్ని.
అత్యంత ఖరీదైన ఎన్నికలివీ!
Published Wed, May 14 2014 1:56 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement