మహిళలు సాధించిన మరో భారీ విజయం
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి మహిళల్ని అనుమతించడంపై భూమాత బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు సాధికారత సాధించే దిశలో మరో పెద్ద విజయమని అని వ్యాఖ్యానించారు. ఇక ముందు మహిళలు, పురుషులు సమానంగా గర్భగుడిలో పూజలు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ నాసిక్ లెక్టర్ డీఎస్ కుష్వా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తృప్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే అంతకుముందే ప్రతిరోజూ గంటసేపు గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని దేవస్థానం ట్రస్టు నిర్ణయించింది. అయితే వారు తడి నూలు వస్త్రాలు లేదా పట్టు వస్త్రాలు ధరించాలని షరతు పెట్టింది. ఈ నిబంధనలను తృప్తి, సహా మరికొంతమంది మహిళా ఉద్యమకారులు పోరాటానికి దిగారు. అటు ఆలయ ప్రవేశం విషయంలో స్త్రీ పురుష సమానత్వం పాటించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.