పంజాబ్, హర్యానా హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు | Three new judges appointed for Punjab and Haryana High Court | Sakshi
Sakshi News home page

పంజాబ్, హర్యానా హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు

Published Sat, Jun 21 2014 2:59 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

Three new judges appointed for Punjab and Haryana High Court

న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అశుతోష్ మొహంతా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. జస్టిస్ మొహంతా గతంలోనూ పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అయితే 2010లో ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కేంద్రం బదిలీ చేసింది. మరోవైపు మొహంతాతో పాటు రేఖా మిట్టల్, ఇంద్రజిత్ సింగ్‌లను పంజాబ్, హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించింది. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement