పోలీసు వాహనంపై షాకింగ్‌ టిక్‌టాక్‌ వీడియో | TikTok User Does Push ups on a Moving Police Car | Sakshi
Sakshi News home page

పోలీసు వాహనంపై షాకింగ్‌ టిక్‌టాక్‌ వీడియో

Published Thu, Jun 27 2019 3:08 PM | Last Updated on Thu, Jun 27 2019 3:14 PM

TikTok User Does Push ups on a Moving Police Car - Sakshi

టిక్‌టాక్‌ ఓపెన్ చేస్తే చాలు.. సమయం ఇట్టే గడిచిపోతుంది. అసలు బోర్‌ కొట్టడమనే సమస్యే ఉండదు. అందుకే ఇతర సోషల్‌ మీడియా యాప్‌లను తలదన్నుతూ టిక్‌టాక్‌ ఇండియాలో దూసుకుపోతుంది. ఒకవైపు ఒకవైపు ఈ యాప్‌కు జనాలు అడిక్ట్‌గా మారుతుండగా.. మరోవైపు వింతవింత వీడియోలు, స్టంట్‌లతో మరోవైపు దీని యూజర్లు కిర్రెక్కిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసు వాహనంపై స్టంట్లు చేసి.. ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. ఢిల్లీ పోలీసు వాహనాన్ని స్లోగా నడుపుతూ.. అది నడుస్తుండగా దానినుంచి దిగి.. టాప్‌ మీదకు ఎక్కి.. మనోడు పుషప్‌ (బస్కీ)లు చేశాడు.

అంతే ఈ వీడియో టిక్‌టాక్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వైరల్‌ వీడియో ఓ నెటిజన్‌ ఢిల్లీ పోలీసులకు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘనకార్యాన్ని చేసిన వ్యక్తిని గుర్తించి తగినరీతిలో చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఇక, ఈ కేసు విచారణ పురోగతిని బయటపెట్టాలని ఢిల్లీ పోలీసులను నెటిజన్లు డిమాండ్‌ చేశారు. నడిచే పోలీసు వాహనంపై సదరు వ్యక్తి చెత్త, బోరింగ్‌ స్టంట్లు చేశాడని ఎద్దేవా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement