'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్' | TMC minister Firhad Hakim defends mini Pakistan comment, calls it a communal conspiracy | Sakshi
Sakshi News home page

'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్'

Published Sat, Apr 30 2016 3:05 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్'

'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్'

పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత బాబీ ఫర్హాద్ హకిమ్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాకిస్థాన్ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన 'నా నియోజకవర్గమే కోల్ కతాలో మినీ పాకిస్థాన్ లాంటిది' అని పేర్కొన్నారు.

ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ మమతా బెనర్జీ నమ్మిన బంటు అయిన  ఫర్హాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ కు వెళితే ఏమీ లేదు కానీ, తాను పాకిస్థాన్ గురించి ఏమైనా మాట్లాడితే వివాదం చేస్తారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను ముస్లిం కావడం వల్లే ప్రశ్నిస్తున్నారని, ఇందులో మత కలహాల కుట్ర కనిపిస్తున్నదని ఆయన ఎదురుదాడికి దిగారు.

బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫర్హాద్ హకిమ్ నియోజకవర్గంలో ఇటీవల పాక్ దినపత్రిక డాన్ కు చెందిన విలేకరి మలెహా హమిద్ సిదిఖి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ఫర్హాద్ చేసిన మినీ పాకిస్థాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. భారత్ లోని ముస్లింల గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement