TMC minister
-
మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సుబ్రతా సాహా కన్నుమూశారు. ముర్షిదాబాద్ మెడికల్ కాళాశాలలో గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన మంత్రిని ఆసుపత్రికి తరలించగా కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కేబినెట్ మంత్రి సుబ్రతా సాహా మృతి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీరని లోటుగా పార్టీ వర్గాలు తెలిపాయి. సుబ్రతా సాహా ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. ముర్షిదాబాద్‌లోని సగర్దిఘి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలుపొందారు. 69 ఏళ్ల సాహాకు ఇటీవలే పిత్తాశయ ఆపరేషన్ జరిగింది. అనారోగ్యం నుంచి కోలుకును బుధవారం ఉదయమే సొంత జిల్లాకు తిరిగివచ్చారు మంత్రి. కానీ, రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన బెర్హంపోర్లోని ముర్షిదాబాద్ మెడికల్ కలేజీలో చేర్పించారు. గురువారం ఉదయం మరణించారు. మమత బెనర్జీ దిగ్భ్రాంతి.. మంత్రి సుబ్రతా సాహా ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘సుబ్రతాబాబుతో దీర్ఘకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయ, సామాజిక సేవలు గుర్తుండిపోతాయి. సుబ్రతా సాహా మృతితో రాజకీయ ప్రపంచంలో లోటు ఏర్పడింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సామాజిక మాద్యమాల్లో రాసుకొచ్చారు దీదీ. ముర్షిదాబాద్ జిల్లా నుంటి 2011లో టీఎంసీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు సుబ్రతా సాహా. సగర్డిఘి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. తొలిసారి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఎంసీలో చేరారు. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. టీఎంసీ సీనియర్ నేత రాజీనామా! -
రాష్ట్రపతి ముర్ముపై మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు! వైరల్
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. రాజకీయ విమర్శలకు కారణం అయ్యాయి. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో ఒకటి వివాదాస్పదంగా మారింది. ‘‘ఆయన(బీజేపీ నేత సువేందు అధికారి).. నేను (అఖిల్ గిరి) చూడడానికి బాగోలేను అన్నాడు. మరి ఆయనెంత అందంగా ఉన్నాడు?. ఒకరిని అప్పీయరెన్స్ బట్టి అలా నిర్ణయించకూడదు. అంతెందుకు మనం మన రాష్ట్రపతి కుర్చీకి గౌరవం ఇస్తాం. మరి ఆ రాష్ట్రపతి చూడానికి ఎలా ఉంటారు?’’ అని అఖిల్ గిరి అక్కడ ఉన్న కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడున్న వాళ్లు ఈలలు, చప్పట్లతో అఖిల్‌ను మరింత ప్రొత్సహించారు. President Droupadi Murmu, hails from the Tribal community. Akhil Giri, TMC Minister of Correctional Homes made objectionable comments about her in the presence of Shashi Panja, another minister from the women’s welfare department Mamata Banerjee and TMC are anti-tribal. pic.twitter.com/vJNiZ7nBLM — BJP Bengal (@BJP4Bengal) November 11, 2022 ఇక టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. గిరిజనులకు మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని టీఎంసీ పార్టీ వ్యతిరేకమని విమర్శించింది. మరో మంత్రి.. అదీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా సమక్షంలో అఖిల్ గిరి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ హైలెట్ చేసింది. Akhil Giri, minister in Mamata Banerjee’s cabinet, insults the President, says, “We don't care about looks. But how does your President look?" Mamata Banerjee has always been anti-Tribals, didn’t support President Murmu for the office and now this. Shameful level of discourse… pic.twitter.com/DwixV4I9Iw — Amit Malviya (@amitmalviya) November 11, 2022 బీజేపీ నేత అమిత్ మాలవియా.. టీఎంసీ నేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ కేబినెట్లోని అఖిల్ గిరి.. రాష్ట్రపతిని ఘోరంగా అవమానించారు. అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ముర్ముకు మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇలా అవమానించడాన్ని ప్రొత్సహిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారాయన. BJP MP Saumitra Khan writes to National Commission for Women (NCW), requesting them to "immediately arrest" Akhil Giri and take appropriate action against him and "try to dismiss him from the MLA post also" over his objectionable remark on President Droupadi Murmu. https://t.co/DJqIQ6uTFt pic.twitter.com/K4HnVBtHrT — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎంట్రీతో మారిన హిమాచల్ సీన్ -
2001లో కేవలం రూ.6,300.. 2022లో కోట్లకు చేరిన మంత్రి సంపద..
కోల్‌కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు మొత్తం రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని కోట్లున్న మాజీ మంత్రి వద్ద పదేళ్ల క్రితం కేవలం రూ.6,300 ఉన్నాయంటే నమ్మగలరా? 2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థ చటర్జీ సమర్పించిన అఫిడవిట్లో ఆయన వద్ద రూ.6,300 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మొత్తం 23 రెట్లు పెరిగింది. ఈసారి అఫిడవిట్లో తన వద్ద రూ.1,48,676 నగదు ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అవినీతి కేసులో మంత్రి సన్నిహితుల ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం రాజకీయంగా కలకలం రేపింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీలోని అని పదవుల నుంచి తప్పించింది. ఇంకా పార్థ చటర్జీ, ఆయన సన్నిహితులకు సంబంధించిన నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన మాత్రం తనపై కుట్ర చేస్తున్నారని అంటున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందనడం గమానార్హం. చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి -
అవినీతి కేసులో మంత్రి అరెస్టుపై సీఎం మమత కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: అవినీతికి పాల్పడే వారు, తప్పులు చేసే వారికి తాను మద్దతుగా నిలువబోనని చెప్పారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎవరైనా తప్పు చేసినట్లు నిరూపితమైతే వాళ్లకి యావజ్జీవ శిక్ష పడినా తానేం అనుకోనని తెలిపారు. అలాంటి వ్యవహారాల్లోకి తన పేరు లాగొద్దని సూచించారు. తాను ప్రభుత్వం నుంచి వచ్చే జీతం కూడా తీసుకోవట్లేదని వెల్లడించారు. మంత్రి అవినీతికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోయానని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానని మమత పేర్కొన్నారు. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసిన రెండు రోజులకు మమత ఈమేరకు స్పందించారు. ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తప్పులు చేసినవారికి సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇవ్వాలని మమత అన్నారు. అందరూ సాధువులు అని తాను భావించట్లేదని, కానీ ఇప్పటివరకు తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. మంత్రికి మరిన్ని అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అయితే అరెస్టు అయిన అనంతరం సీఎం మమతా బెనర్జీకి పార్థ చటర్జీ నాలుగుసార్లు ఫోన్ కాల్ చేశారని వార్తలొచ్చాయి. టీఎంసీ మాత్రం వీటిని ఖండించింది. చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. అర్పితకు కానుకలు! -
కుక్కల కోసం లగ్జరీ ఫ్లాట్.. పార్థ చటర్జీ ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో ఆయనకు సంబంధించిన మరిన్ని అక్రమాస్తులు బయటపడుతున్నాయి. కోల్‌కతాలో ఖరీదైన డైమండ్ సిటీలో మంత్రిగారికి మూడు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఒకటి కేవలం కుక్కల కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఆ ఫ్లాట్‌కు ఏసీ కూడా ఉందట. పార్థ చటర్జీకి జంతుప్రేమికుడని గుర్తింపు ఉంది. అందుకే శునకాల కోసం ప్రత్యేకంగా ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పార్థ చటర్జీని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదు, రూ.కోటి కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్పితకు పార్థ చటర్జీ మూడు ఫ్లాట్స్‌ను కానుకగా ఇచ్చారని, వాటిలో ఒక నివాసంలోనే డబ్బు, బంగారం సీజ్ చేసినట్లు ఈడీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు వీరిద్దరి పేరు మీద బోల్పుర్లోని శాంతినికేతన్లో ఓ అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. దీంతో శాంతినికేతన్‌లోని ఏడు ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లపై అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మమతకు ఫోన్ అరెస్టయిన రోజు మంత్రి పార్థ చటర్జీ సీఎం మమతా బెనర్జీకి నాలుగు సార్లు ఫోన్ కాల్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఉదయం 1:55 గంటలకు, 2:33 గంటలకు ఫోన్ చేస్తే మమత ఎత్తలేదని పేర్కొన్నాయి. ఆ తర్వాత తిరిగి 3:37 గంటలకు, 9:35 గంటలకు ఫోన్ చేసినా మమత నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పాయి. అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేయమని అడిగినప్పుడు సీఎంకే ఆయన ఫోన్ చేసినట్లు వివరించాయి. అయితే టీఎంసీ మాత్రం దీన్ని ఖండించింది. సీఎం మమతకు పార్థ చటర్జీ ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని పేర్కొంది. చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..! -
ఈడీ రైడింగ్‌లో బయటపడ్డ నోట్ల కట్టలు.. టీఎంసీ మంత్రివేనా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కుంభకోణానికి సంబంధించి కోల్‌కతాలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితుల నివాసాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అన్నీ రూ.2000, 500 నోట్ల కట్టలే ఉన్నాయి. వీటి మొత్తం రూ.20 కోట్లు అయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు అధికారులను పిలిచించి క్యాష్ కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు. రూ.20 కోట్లకు సంబంధించి అర్పిత వద్ద సరైన లెక్కలు లేవని అధికారులు పేర్కొన్నారు. డబ్బుతో పాటు 20 మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇవన్నీ ఎస్ఎస్సీ కుంభకోణానికి సంబంధిచినవే అయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్ విద్యాశాఖ సహాయమంత్రి పరేశ్ అధికారికి నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఎస్ఎస్సీ కుంభకోణానికి సంబంధించి మంత్రులు పార్థ చటర్జీ, పరేశ్ అధికారిలను సీబీఐ ఇప్పటికే గంటలపాటు ప్రశ్నించింది. చదవండి: యే క్యా హై మోదీజీ.. వాళ్లకోసం ఏమైనా చేస్తారు.. సీనియర్ సిటిజెన్లకు రాయితీ ఇవ్వలేరా? -
'నోర్ముయ్.. చెంప పగులుద్ది'
-
'నోర్ముయ్.. చెంప పగులుద్ది'
సాక్షి, కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ బ్యాంకులోకి వెళ్లి అందులో ఉద్యోగిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎక్కువమాట్లాడితే లాగిపెట్టి కొట్టి ఈడ్చి బయటకు గెంటేస్తానంటూ కళ్లెర్రజేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీఎంసీ మంత్రి రవీంద్రనాథ్ ఘోష్ గుగుమారి అనే ప్రాంతంలో తన కారులో వెళుతూ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద బారులు తీరిన జనాల్ని చూశారు. అయితే, వెంటనే కారు ఆపుజేయించి నేరుగా వారి వద్దకు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. కొద్ది రోజులుగా బ్యాంకు సరిగా పనిచేయడం లేదని, అంతర్జాలం (ఇంటర్నెట్) సమస్య కారణంగా లావాదేవీలు సక్రమంగా జరగడం లేదని చెప్పారు. దీంతో వేగంగా లోపలికి దూసుకెళ్లిన ఆయన.. 'ఎవరు దీనికి బాధ్యులు?' అని ప్రశ్నించగా 'మా బాధ్యతే సర్' అంటూ ఉద్యోగి బదులు ఇచ్చారు. అయితే, ఆయన మాటలు ఏవి పట్టించుకోకుండా.. 'నోర్ముయ్.. నీ హద్దులు దాటొద్దు. లాగిపెట్టి చెంప మీద ఒక్కటిస్తాను' అని మంత్రి అన్నారు. 'మీరు అలా మాట్లాడకూడదు. మేం కూడా పనిచేస్తున్నాము' అని ఉద్యోగి అనగా.. మంత్రి ఆగ్రహంతో.......(చెప్పరాని మాటలు) నోర్ముయ్.. నిన్ను బయటకు గెంటేస్తా' అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో కూడా రికార్డయ్యాయి. దీనిపై బ్యాంకు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుపునుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. -
'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్'
పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత బాబీ ఫర్హాద్ హకిమ్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాకిస్థాన్ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన 'నా నియోజకవర్గమే కోల్ కతాలో మినీ పాకిస్థాన్ లాంటిది' అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ మమతా బెనర్జీ నమ్మిన బంటు అయిన ఫర్హాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ కు వెళితే ఏమీ లేదు కానీ, తాను పాకిస్థాన్ గురించి ఏమైనా మాట్లాడితే వివాదం చేస్తారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను ముస్లిం కావడం వల్లే ప్రశ్నిస్తున్నారని, ఇందులో మత కలహాల కుట్ర కనిపిస్తున్నదని ఆయన ఎదురుదాడికి దిగారు. బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫర్హాద్ హకిమ్ నియోజకవర్గంలో ఇటీవల పాక్ దినపత్రిక డాన్ కు చెందిన విలేకరి మలెహా హమిద్ సిదిఖి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ఫర్హాద్ చేసిన మినీ పాకిస్థాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. భారత్ లోని ముస్లింల గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు.