న్యూఢిల్లీ: విశ్రాంత ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. వృద్ధులు, వికలాంగులైన విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా పెన్షన్ వారింటికే వచ్చి అందించే విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. వృద్ధులు, వికలాంగులైన విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా పెన్షన్ వారింటికే వెళ్లి అందించే యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అలాగే, పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఉద్యోగ విరమణ రోజే అందించడంతో పాటు, ఇతర అన్ని రకాల నగదు బాకీలను వారి ఇంటికి వెళ్లి అందించాలన్నది తమ లక్ష్యమని అన్ని రాష్ట్రాల పెన్షన్ కార్యదర్శులతో సమావేశమైన సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ దిశగా పెన్షన్ విభాగం పనిచేస్తోందని తెలిపారు. ఇక, మెరుగైన సమాజం కోసం పెన్షనర్ల నైపుణ్యం, అనుభవాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు విరమణ పొందుతుండడం, జీవిత కాలం పెరిగిపోవడంతో ఇది అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.
నెలనెలా ఇంటికే పెన్షన్: కేంద్రం యోచన
Published Sat, Jun 14 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement
Advertisement