మన సముద్రాల్లో కోట్ల టన్నుల నిక్షేపాలు | Tons of crores metallic, mineral wealth in our oceans | Sakshi
Sakshi News home page

మన సముద్రాల్లో కోట్ల టన్నుల నిక్షేపాలు

Published Tue, Jul 18 2017 4:37 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

మన సముద్రాల్లో కోట్ల టన్నుల నిక్షేపాలు

మన సముద్రాల్లో కోట్ల టన్నుల నిక్షేపాలు

భారతదేశానికి ఇరువైపులా ఉన్న సముద్ర ప్రాంతంలో కొన్ని కోట్ల టన్నుల లోహ, ఖనిజ సంపద ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించింది. మంగళూరు, చెన్నై, మన్నార్‌ పరీవాహక ప్రాంతం, అండమాన్, నికోబార్‌ ద్వీపాల్లో జీఎస్‌ఐ మూడేళ్లపాటు పరిశోధనలు నిర్వహించింది. అత్యాధునిక సముద్ర రత్నాకర, సముద్ర కౌస్తుభ నౌకల ద్వారా జరిగిన ఈ పరిశోధనల్లో భాగంగా 1.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సముద్రగర్భం తాలూకూ వివరాలను అత్యంత సూక్ష్మస్థాయిలో గుర్తించింది.

ఈ వివరాల ఆధారంగా మనకు మాత్రమే హక్కులున్న సముద్ర ప్రాంతంలో దాదాపు వెయ్యి కోట్ల టన్నుల సున్నపు మట్టి ఉన్నట్లు గుర్తించింది. అంతేకాకుండా కర్ణాటకలోని కార్వార్, మంగళూర్, చెన్నై ప్రాంతాల్లో ఫాస్ఫేట్, మన్నార్‌ నదీ పరీవాహక ప్రాంతంలోని చానెల్‌ లీవీలో గ్యాస్‌ హైడ్రేట్లు ఉన్నట్లు జీఎస్‌ఐ పరిశోధనల ద్వారా స్పష్టమైంది. అండమాన్‌ సముద్ర ప్రాంతంలో కోబాల్ట్‌తో కూడిన ఫెర్రోమాంగనీస్, లక్షద్వీప్‌ వద్ద మైక్రో మాంగనీస్‌ వంటి ఖనిజాలున్నట్లు స్పష్టమైందని జీఎస్‌ఐ సూపరింటెండెంట్‌ అశీస్‌నాథ్‌ తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement