ఘోర రైలు ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో చురేబ్ రైల్వే స్టేషన్ లో జరిగిన గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఘోర రైలు ప్రమాదంపై కాబోయే ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన సహాయక చర్యలను అందించాలని కేబినెట్ సెక్రెటరీ అజిత్ సేథ్ ను ఆదేశించారు.
గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ దుర్భటనలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. చురేబ్ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలును గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.